అమరావతి
*పవన్ కళ్యాణ్*
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.
ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అన్ని ప్రాంతాల్లో వరి, మొక్క జొన్న, ఉద్యాన పంటలు వేసిన రైతులకు కన్నీరే మిగిలింది.
రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి పెట్టుబడి రాయితీని అందించాలి.
ధాన్యం కల్లం మీద ఉంది. అలాగే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కోతలు నడుస్తున్నాయి. వెన్ను విరిగి పంట నీట మునిగిపోయింది.
ఇలా దెబ్బ తిన్న వరి రైతులకు ప్రభుత్వం తగిన ఉపశమన పథకాలు అమలు చేయాలి.
రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలి.
ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రావడంతో స్థానిక రైతులకు మద్దతు ధర రావడం లేదు.
మామిడి రైతుల ఆశలను ఓ వైపు కరోనా దెబ్బ తీస్తే ఇప్పుడు అకాల వర్షాలు మరోసారి దెబ్బ తీశాయి.
మామిడితోపాటు అరటి, ఇతర పండ్ల తోటల రైతులను, కూరగాయలు సాగు చేస్తున్నవారిని ఆదుకోవాలి.
2019-20 ఆర్థిక సంవత్సరంలోనే ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు కేటాయించారు.
ఆ మొత్తం నుంచి నిధులు కేటాయించి రైతులను ఆదుకొని నష్టపోకుండా కాపాడాలి.
రైతుల నుంచి వసూలు చేసే నీటి తీరువాను రెట్టింపు చేయాలనే ప్రతిపాదన సరికాదు.
గిట్టుబాటు ధరలు లేక, మార్కెట్ సదుపాయం లేకపోవడంతో రైతులు కష్టాల్లో ఉన్నారు
పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాను.