నష్టపోయిన రైతులను ఆదుకుంటాంః వ్యవసాయ శాఖా మంత్రి కురసాల

తేది: 26.04.2020


అమరావతి, ఏప్రిల్ 26 (అంతిమ తీర్పు) : అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాంః              వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు.పంట నష్టంపై అధికారులతో సమీక్షించిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు.అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అకాల వర్షాలు-పంట నష్టంపై అధికారులతో మంత్రి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా నష్టపోయిన పంట వివరాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. పంట నష్టంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి వాకబు చేశారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు .


పంట నష్టం వివరాలను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం తరఫున రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఇది రైతు ప్రభుత్వం అని కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల వివిధ జిల్లాల్లో జరిగిన పంట నష్టం వివరాలను కురసాల కన్నబాబు వివరించారు.


*ప్రాథమిక సమచారం మేరకు వివిధ జిల్లాలో పంట నష్టం వివరాలు (హెక్టార్లలో)..*


జిల్లా      పంట విస్తీర్ణం (హెక్టార్లలో)
  ధాన్యం మొక్కజొన్న    నువ్వులు   వేరుశెనగ     పొద్దుతిరుగుడు పొగాకు  విస్తీర్ణం


శ్రీకాకుళం  40.00 0.00     0.00      0.00  0.00  0.00 40.0
విజయనగరం          64.00 200.00    60.00   0.00  0.00 0.00 324.00
విశాఖపట్నం 51.81 0.00    98.20    0.40   4.00 0.00 151.41
ప. గోదావరి  136.30    135.00     0.00 19.౦౦  0.00 0.00 309.30
కృష్ణా   3525.25    34.00     0.00    4.00  0.00 0.00 3563.25
అనంతపురం   55.00 151.00     0.00  0.00  0.00 0.00  206.00


ఇక, తూర్పు‌ గోదావరి విషయానికి వస్తే.. నేలకొరిగిన పంట .. 9337 హెక్టార్లు, పనలు మీద ఉండి వర్షం పాలైన పంట 1378 హెక్టార్లు,  కట్టలు కట్టి ఉండిపోయిన పంట..883  హెక్టార్లు, నూర్పుడి  కల్లాల్లో ఉన్న ధాన్యం 7191హెక్టార్లని  గణాంకాలు వెల్లడించారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు