కౌలు రైతు కి పుట్టెడు కష్టాలు

కౌలు రైతు కి పుట్టెడు కష్టాలు
ఉదయగిరి:    నియోజకవర్గం లోని వరికుంటపాడు మండలం లో కౌలు రైతు లు పుట్టెడు కష్టాలు తో అల్లాడుతున్నారు.  సుమారు నెల రోజులు గా జొన్న, వరి, శెనగ పంట లను కోసి ఇళ్లలో చేర్చుకున్నారు, తీరా ధాన్యాన్ని అమ్ముకోడానికి అగచాట్లు పడుతున్నారు. వరికుంటపాడు, ఉదయగిరి, సీతారాంపురం మండలాలకు సంబందించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని దుత్తలూరు లో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రానికి వెళ్లిన కౌలు రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలనీ అభ్యర్దించగా కౌలు రైతు ల సంబందించిన పూర్తి వివరాలు అందుబాటులో లేవు అని పూర్తి వివరాలు వచ్చిన తరువాత నే కొనుగోలు చేస్తాం అని అక్కడి అధికారులు తేల్చి చెప్పారు, దీంతో దిక్కు తోచని స్థితి లో కౌలు రైతులు నలిగి పోతున్నారు. ఆరుగాలం శ్రమించి రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యాన్ని సకాలం లో అమ్ముకోలేకపోతున్నాం అని బెంగ పడుతున్నారు. నెలల తరబడి ఇళ్లలో ఉండిపోవడం తో ధాన్యం  బరువు తగ్గిపోవడం తో పాటు నాణ్యత కూడా దిగజారే ప్రమాదం ఉందని వాపోతున్నారు. మండలం లోని కాంచెరువు, గొల్లపల్లి, ఎర్రంరెడ్డిపల్లి, పాపనగారిపల్లి, మహ్మదాపురం, విరువూరు, తూర్పు పాలెం, కృష్ణంరాజు పల్లి, కొండాయపాలెం, తొడుగుపల్లి గ్రామాల్లోని జొన్న, వేరుశెనగ, మినుములు ఇళ్లలోనే ఉండిపోయాయి, పండించిన ధాన్యం కళ్ళముందే ఉంచుకున్న కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై వరికుంటపాడు మండల వ్యవసాయ అధికారి శ్రీహరి ని వివరణ కోరగా కౌలు రైతుల సమస్య లు తమ దృష్టి కి వచ్చాయని కౌలు రైతుల కార్డు లకి సంబందించి సాంకేతిక సమస్య ఏర్పడింది అని ఈ విషయం ఉన్నత అధికారులు కి తెలియజేసాం అని త్వరలో సమస్య పరిష్కారం అవుతుంది అని ఆయన తెలిపారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు