అత్యవసర ప్రయాణాలకు ఏపీలో పాసులు

అత్యవసర ప్రయాణాలకు ఏపీలో పాసులు
కోవిడ్‌-19 ఎమర్జెన్సీ వెహికల్‌ పాసులు జారీ చేయనున్న పోలీసులు
విజయవాడ : కరోనా లాక్‌డౌన్‌ను ప్రజలంతా పక్కాగా పాటిస్తున్నారని రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. అయితే, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అత్యవసర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని గుర్తు చేసింది. ప్రధానంగా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటివారికోసం కోవిడ్‌-19 అత్యవసర రవాణా పాసులు అందిస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాసుల జారీకి అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొంది. అత్యవసర కారణాలను చూపి ప్రజలు ఈ పాసులు పొందొచ్చని వెల్లడించింది. పాసులు కావాలనుకునేవారు.. 1.పేరు, పూర్తి చిరునామా, 2.ఆధార్‌ కార్డు వివరాలు, 3.ప్రయాణించే వాహనం నెంబర్‌,  ప్రయాణికుల సంఖ్య,  ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనే పూర్తి వివరాలు సమర్పించాలి. అన్ని పత్రాలను పరిశీలించిన తరువాత సాద్యమైనంత త్వరగా సంబంధిత పోలీసు అధికారులు పాసులు జారీచేస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది.
అప్లయ్‌ చేయడం ఇలా : కోవిడ్‌-19 ఎమర్జెన్సీ వెహికల్‌ పాసులు కావాలనుకునే ప్రజలు తాము నివసిస్తున్న ప్రదేశానికి సంబంధించి పైన ఇచ్చిన వివరాలతో ఆయా జిల్లా ఎస్పీల వాట్సాప్‌ నెంబర్‌ లేదా మెయిల్‌ ఐడీకి అనుమతి కోరుతూ అప్లయ్‌ చేయాలి. జిల్లా ఎస్పీల వాట్సాప్‌ నెంబర్లు, మెయిల్‌ ఐడీలు కింద ఇవ్వడం జరిగింది. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్‌ నెంబర్‌/మెయిల్‌ ఐడీకి పంపిస్తారు. జిల్లా ఎస్పీ వాట్సాప్‌ నెంబర్‌/మెయిల్‌ ఐడీ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఫార్వార్డ్‌ చేసిన అనుమతులు (పాసులు) చెల్లవు. ప్రయాణించేటప్పుడు మీ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని డీజీపీ కార్యాలయం వెల్లడించింది.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
విజయవాడ ఏపీ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కామెంట్స్.. ఓవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్ కు కనిపించడం లేదా ముఖ్యమంత్రి జగన్ వారానికి ఒకటి...రెండు రోజులు స్కూల్ పెట్టడం ఏంటి ముఖ్యమంత్రి జగన్ బాద్యతారాహిత్యానికి ఇది నిదర్శనం పసిపిల్లల ప్రాణాలతో జగన్ ఆటలాడుకుంటున్నారు పిల్లలకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలి
Image
*వింజమూరు చెన్నకేశవస్వామికి ఆభరణం బహూకరణ* వింజమూరు, జూన్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని యర్రబల్లిపాళెంలో పురాతన చరిత్రను సంతరించుకున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారికి నడిమూరుకు చెందిన భక్తులు గురువారం నాడు బంగారు తాపడంతో చేసిన వెండి కిరీటమును, స్వామి అమ్మవార్లుకు పట్టు వస్త్రాలను బహూకరించారు. నడిమూరులో కీ.శే. యల్లాల.చినవెంకటరెడ్డి-ఆయన ధర్మపత్ని పుల్లమ్మల జ్ఞాపకార్ధం వారి కుమారులు యల్లాల.శ్రీనివాసులురెడ్డి, యల్లాల.రఘురామిరెడ్డి, యల్లాల.వెంకటరామిరెడ్డిలు కుటుంబ సమేతంగా దేవస్థానంకు చేరుకుని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు గణపం.వెంకటరమణారెడ్డి, గణపం.సుదర్శన్ రెడ్డి ల సమక్షంలో దేవదేవేరునికి అలంకరణ నిమిత్తం పూజారులకు అందజేశారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్ధం ప్రజలందరూ పాడిపంటలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని అర్చకులు రంగనాధస్వామి, వెంగయ్య పంతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అనిల్, భరత్, పునీత్, ఆశ్రిత్, ఫన్నీ, విరాజిత, రిత్విక తదితరులు పాల్గొన్నారు.
Image