ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.
కావలి ఏప్రిల్ 30 (అంతిమ తీర్పు) :) శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గురువారం జలదంకి మండలం లోని కొత్తపాలెం ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవరం,ముంగమూరు,తాళ్ళపాలెం పంచాయతీ ల చెరువు కు రెండో పంటకు ప్రతి ఎకరానికి పూర్తి గా నీళ్ళు అందించే బాధ్యత తమదని అన్నారు.
ఈ కార్యక్రమం లో ఇరిగేషన్ అధికారులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు అందరూ పాల్గొన్నారు.