ఇలాంటి కష్ట సమయంలోనే మనలోని మానవత్వం, దయాగుణం చూపాలి. ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్
ఉయ్యురు :నగర పంచాయతి 19 వార్డు లో తెలుగుదేశం పార్టీ నాయకులు EX.ఎంపీటీసీ రఫీ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ రజియా బేగం పర్యవేక్షణలో 550 కుటుంబాలకు ఇంటింటికి 9 కోడిగుడ్లు 1 kg ఉల్లిపాయలు పంపిణి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ *రాజేంద్ర ప్రసాద్*
ఈ సందర్భంగా *రాజేంద్ర ప్రసాద్* గారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి సూచనల మేరకు ప్రజలందరూ లాక్ డౌన్ బాధ్యతగా పాటిస్తున్నారని, కుటుంబం గడవని పేదలకు మనమందరం అండగా ఉండి నిత్యావసర సరుకులు, కూరగాయలు పంచి మనలోని మానవత్వం, దయాగుణం చాటాలని *రాజేంద్ర ప్రసాద్* గారు అన్నారు.అలాగే ఈ రోజు 19 వార్డ్ లో ప్రతి ఇంటికి కోడిగుడ్లు, ఉల్లిపాయలు పంచుతున్న రఫీ, రజియా బేగంని అభినందించిన *రాజేంద్ర ప్రసాద్* గారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూనపరెడ్డి వాసు, రఫీ ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు.