నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డ్ లో రైతు బజార్లు

అమరావతి
25.4.2020



- నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డ్ లో రైతు బజార్లు


- కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ మార్కెట్ యార్డ్ లలో కొత్త రైతుబజార్ల ఏర్పాటు


- కరోనా వైరస్ కి ముందు రాష్ట్రంలో కేవలం 100 రైతు బజార్లు.


- కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తాత్కాలిక రైతు బజార్లతో వాటి సంఖ్యను 417 పెంచిన ప్రభుత్వం.


- వీటికి కూడా అధిక సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో మొబైల్ రైతుబజార్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం


- ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన చోట్ల ఆర్టీసీ బస్సుల్లో రైతు బజార్ లో నిర్వహిస్తున్న ప్రభుత్వం


- తాజాగా మార్కెట్ యార్డ్ గోడౌన్లు, ప్లాట్ ఫారాల పై కూరగాయలు, పండ్ల విక్రయాలకు నిర్ణయం.


- రాష్ట్రంలోని 216 మార్కెట్ కమిటీల్లో 150 మార్కెట్ యార్డ్ లు.


- ప్రస్తుతం ఈ యార్డులలో కొనసాగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు 


- నిత్యం రైతులు, హమాలీలు, ప్రభుత్వ శాఖల సిబ్బందితో కలిపి రోజుకి 200 మంది వరకు వ్యవసాయ యార్డ్ లకు వస్తున్నట్లు అంచనా.


- వీరితో పాటు పరిసర ప్రాంతాల వినియోగదారులకు కూడా అనువుగా వుండేలా ఇక్కడే కొత్త రైతు బజార్ల ఏర్పాటు


- కరోనా వైరస్ విస్తరించకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ, ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లను సరసమైన ధరలకే అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు


- మార్కెట్ కమిటీల పరిధిలో మేజర్ పంచాయతీ ల్లో పరిస్థితులను బట్టి రైతు బజార్ లో ఏర్పాటు.


- గోడవున్ లు లేని మార్కెట్ యార్డ్ లలో తాత్కాలికంగా షెడ్లు వేసి అమ్మకాలు నిర్వహించేందుకు మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న ఆదేశాలు.


- గ్రామ, పట్టణ శివారు ప్రాంతాల్లో జనావాసాలకు దూరంగా, కొనుగోలుదారులు పెద్దగా వచ్చే అవకాశం లేని యార్డ్ లకు మినహాయింపు


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
*పేకాట స్థావరంపై పోలీసుల దాడులు* నలుగురు అరెస్ట్..... ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట స్థావరంపై ముందస్తుగా అందిన సమాచారం మేరకు దుత్తలూరు ఎస్.ఐ జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నందిపాడుకు చెందిన ముగ్గురు, ఉదయగిరికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 13 వేల రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు , 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ దుత్తలూరు పరిసరాలలో అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొంతమంది పేకాట నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఎస్.ఐ తేల్చి చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పేకాట, కోడి పందేలు, అకమంగా మద్యం తరలింపు, గ్రామాలలో బెల్టుషాపుల ముసుగులో మద్యం అమ్మకాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ప్రజలు డేగ కన్ను వేసి శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల ఏరివేత దిశగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ ప్రజలకు తెలియజేశారు.
Image
కరోనా పై గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020