దేశంలో తొలి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌.. హైదరాబాద్‌లో ప్రారంభం

దేశంలో తొలి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌.. హైదరాబాద్‌లో ప్రారంభం
హైదరాబాద్‌: ఈఎస్‌ఐ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆన్‌లైన్‌ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఐక్లీన్‌, ఐ సేఫ్‌ సంస్థల సహకారంతో డీఆర్‌డీవో ఈ ల్యాబ్‌ను తయారుచేసింది. కరోనా పరీక్షలతోపాటు, వైరస్‌ కల్చర్‌, వ్యాక్సిన్‌ తయారీపై ఈ ల్యాబ్‌ పనిచేయనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. గబ్చిబౌలిలో 20 రోజుల్లోనే 1500 పడకలతో టిమ్స్‌ను ఏర్పాటుచేశామని చెప్పారు. కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం అనుసరిస్తున్నామని వెల్లడించారు. కోవిడ్‌-19 చికిత్స కోసం ఎనిమిది ప్రత్యేక హాస్పిటళ్లను ఏర్పాటుచేశామని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలుచేస్తున్నామని చెప్పారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు