కరోనా వ్యాప్తి చెందకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల చర్యలు: కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్

విజయవాడ


*ఇంతియాజ్.. కృష్ణా కలెక్టర్*


కరోనా వ్యాప్తి చెందకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం


ప్రత్యేక అధికారి సిద్ధార్ధ జైన్, ఇతర ఉన్నతాధికారుల  సూచనలు పాటిస్తున్నాం


అన్ని‌శాఖల అధికారులు సమన్వయం తో పని‌ చేస్తూ .. కరోనా పై పోరాడుతున్నారు


సియస్ ఈరోజు కృష్ణా జిల్లాలో పరిస్థితి పై సమీక్ష చేశారు


కరోనా శాంపిల్స్ చెక్  చేయడానికి ర్యాపిడ్ టెస్ట్ కిట్  జిల్లాకు రానున్నాయి


వీటి ద్వారా వెయ్యి శాంపిల్స్ ను ఒక రోజులో చేయవచ్చు 


రేపటి నుంచి వీలైనన్ని ఎక్కువ సంఖ్య లో శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం


ఎవరికి ఎటువంటి అనుమానం ఉన్నా.. వచ్చి పరీక్ష చేయించుకోవచ్చు


రేపు‌ కొత్తపేట, రాణిగారి తోట , జగ్గయ్యపేట, ముప్పాళ్ల, రాఘవాపురం లో శాంపిల్ కలెక్షన్ జరుగుతుంది


అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ శాంపిల్స్ ఇచ్చి   పరీక్ష కు సహకరించగలరు


మంగళవారం ఖుద్దూస్ నగర్ మచిలీపట్నం, నూజివీడు లలో పరీక్ష లు చేస్తాం


లాక్ డౌన్ ను ప్రతిఒక్కరూ పాటించి, ఇంటికే పరిమితం కావాలని కోరుతున్నాం


రెడ్ జోన్ ప్రాంతాలకు మేమే నిత్యావసర వస్తువులను పంపిస్తున్నాం


కరోనా పై సోషల్ మీడియా లో అసత్యాలు ప్రచారం చేస్తే శిక్షలు తప్పవు


అధికారికంగా ఇచ్చే ప్రకటనలు మాత్రమే ప్రజలకు‌ చెప్పాలి


ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్ర కోవిడ్ సెంటర్ గా ఉండటంతో ఒపి సేవలు నిలిపివేశాం


వారి కోసం ఇ.యస్.ఐ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాటు చేశాం


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు