రెడ్ జోన్ల మీద ప్రత్యేక దృష్టి సారించండి అధికారులతో గూడూరు సబ్ కలెక్టర్
గూడూరు :సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ IAS అధ్యక్షతన డివిజనల్ స్థాయి అధికారులతో సమీక్ష.లాక్ డౌన్ సడలింపులు,జోన్ల వారిగా అమలుచేయాల్సిన నిబంధనలు తీసుకోవలిసిన చర్యలు మీద అధికారులకు సూచనలు.
*పరిశ్రమలకు అనుమతి జిల్లా కలెక్టరేట్ లో తీసుకోవాలిసిందే,లిక్కర్ పూర్తిగా నిషిద్ధం.ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలి.ఉదయం 10 తరువాత రెవెన్యూ పోలీస్ శాఖ లు లాక్ డౌన్ అమలు పటిష్టం గా అమలుచేయాలి.గూడూరు డివిజన్ లో మూడు మాత్రమే గ్రీన్ జోన్లు.
ఈ రోజు గూడూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ లో డివిజన్ స్థాయి అధికారులకు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ కొన్ని సూచనలు చేశారు,ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ లోని కొన్ని వెసులుబాటులు మీద అవగాహన కల్పించారు,గ్రీన్ జోన్ లో మాత్రమే కొన్ని వెసులుబాటులు వుంటాయని,మిగిలిన జోన్లలో లాక్ డౌన్ యడావిడిగానూ ఇంకా కఠిన తరంగానూ అమలు చేయాలన్నారు,రెడ్ జోన్ లోని వారికి గ్రీన్ జోన్ల నుండి డాక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకుని సహాయ సహకారాలు అందించాలని,రెడ్ జోన్లోని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట రాకూడదని అలా వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు,ఏ విషయమైనా స్పాట్ లో నిర్ణయాలు తీసుకునే అధికారం మండల తహసీల్దార్ కు ఉంటుందని వివరించారు,
అలాగే గూడూరు డివిజన్ లో మూడు మండలాలు గ్రీన్ జోన్లు ఉన్నాయని
1.డక్కిలి
2.సైదాపురాం
3.కోట మండలాలు గా గుర్తింపు...
ఈ గ్రీన్ జోన్లలో 4వీలర్ లో ఐతే డ్రైవర్ తోపాటు వెనక ఇద్దరు ప్రయాణించే అవకాశం ఇచ్చారని చెప్పారు,
ఈ సమీక్షలో గూడూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు,గూడూరు DSP భవాని హర్ష,DDMHO అచ్యుత కుమారి,ఫిషరీస్ AD చాంద్ బాషా ఇంకా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు...