రంజాన్ నిబంధనలు ప్రకారం జరుపుకొండి:డీఎస్పీ మాసూమ్ భాషా
అమలాపురం :. డీఎస్పీ మాసూమ్ భాషా
నిబంధనలకు అనుగుణంగా రంజాన్ నిర్వహించు కోవాలని డీఎస్పీ మాసూమ్ భాషా అన్నారు.
రాజోలు సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఉన్న ముస్లిం పెద్దలతో నగరం పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ మాసూమ్ భాషా సమావేశం నిర్వహించారు. రంజాన్ మాసాన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో నిబంధనలు పాటిస్తూ చేసుకోవడం సమాజం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉపవాసాలు,మరియు నమాజులు చేసుకోవడం మన కర్తవ్యం అని డీఎస్పీ అన్నారు. అదే విధంగా నమాజులు ప్రార్ధనలు అందరూ తమ ఇళ్ళల్లోనే చేసుకోవాలని మీకు ఎటువంటి సమస్య వచ్చిన పరిష్కరించే దిశలో ప్రభుత్వం ముందుందన్నారు.అదే విధంగా సోషల్ మీడియా లో ముస్లిం లను కించపరిచే విధంగా పోస్ట్ లు "ఫేక్ వీడియో"లు పెట్టే వారికి కఠిన శిక్షలు ఉంటాయని తెలియచేసారు. మే 3 తర్వాత పరిస్థితులను బట్టి ఆంక్షల సడలింపును కమిటీలకు తెలియచేస్తానని తెలిపారు.
మనందరం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నామని అందువలన అందరూ ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరించాలని కోరారు.
. ప్రతి మస్జీద్ లో ఆజాన్ ఇచ్చుటకు మరియు ఉపవాస సైరన్ మ్రోగించుటకు పర్మిషన్ ఇచ్చామన్నారు.
ప్రతి మస్జీద్ లో ఇమామ్,మౌజన్ మరియు ఇంకొకరికి మాత్రమే పర్మిషన్ ఇచ్చామని అమలాపురం DSP మాసూమ్ భాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజోలు CI దుర్గా శేఖర్ రెడ్డి, నగరం SI సతీష్ పాల్గొన్నారు.
రంజాన్ నిబంధనలు ప్రకారం జరుపుకొండి: అమలాపురం డీఎస్పీ మాసూమ్ భాషా