కనిపించిన నెలవంక..     నేటి  నుండి  రంజాన్‌ మాసం

*కనిపించిన నెలవంక..     నేటి  నుండి  రంజాన్‌ మాసం*


ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శుక్రవారం నెలవంక కనిపించడంతో.. నేటి     నుంచే రంజాన్‌ మాసం ప్రారంభమవుతుంది. శనివారం నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు చేస్తారు. రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారు. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో రంజాన్‌ మాసంలో ఇంట్లోనే నమాజు చేయాలని ముస్లింలకు ఢిల్లీలోని జామా మసీదు, ఫతేపురి మసీదు షాహీ ఇమామ్‌లు సూచించారు. కరోనా వైరస్‌ వ్యాపించకుండా సహకరించాలని కోరారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు బయటికెళ్లి ‘రంజాన్‌’ సామాగ్రిని తెచ్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  


మహ్మదీయుల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్‌ అవతరించిన మాసం రంజాన్‌. 


చంద్రమాన క్యాలెండర్‌ ప్రకారం ఇది తొమ్మిదో నెల. ఈ నెలను ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు. 


సంవత్సరంలో 11 నెలలు సొంతానికి గడిపినా రంజాన్‌ నెలలో మాత్రం దైవ చింతనతో గడపాలని మత గురువులు చెబుతున్నారు.


 జీవనోపాధికి చేస్తున్న పనుల్లో నిమగ్నమవుతూ దైవచింతన తప్ప ప్రాపంచిక విషయాల వైపు దృష్టి మరల్చకూడదు. అందుకే ముస్లీంలందరూ రంజాన్‌ నెలలో ఉపవాసదీక్షలు పాటిస్తూ(రోజా) పూర్తిగా త్రికరణశుద్ధితో నిష్కల్మషంగా ఉంటారు. శుక్రవారం నుంచి తరావీహ్‌ నమాజ్‌లు ప్రారంభమయ్యాయి. శనివారం తెల్లవారుజామునుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు