జర్నలిస్టుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా :: మంత్రి వెల్లంపల్లి

జర్నలిస్టుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా :: మంత్రి వెల్లంపల్లి


ఏపీయూడబ్ల్యూజే విజయవాడ 
అర్బన్ నేతలకు మంత్రి హామీ


     విజయవాడలో, ఏప్రిల్ 27,(అంతిమ తీర్పు):         కరోనా విపత్కర పరిస్థితుల్లో పొంచి ఉన్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు వివిధ విభాగాలకు అమలు చేస్తున్న 50 లక్షల రూపాయల భీమా సదుపాయాన్ని జర్నలిస్టులకు వర్తింపచేయాలని ఏపీయూడబ్ల్యూజే నేతలు  మంత్రి ని కోరారు. సోమవారం ఉదయం ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, రాజేశ్వరరావు కొండా , ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావులు  రాష్ట కమిటీ పిలుపు మేరకు  మంత్రికి వినతిప్రతం సమర్పించారు.  విధినిర్వహణలో ఉన్న పాత్రికేయులందరికీ పీపీఈ కిట్లు, మాస్క్లు, శానిటైజర్లు ఇవ్వాలని,రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న జర్నలిస్టుల హెల్త్ కార్డుల పథకం గడువు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసినందున 2020-21 సంవత్సరానికి కూడా అంతరాయం లేకుండా కొనసాగేలా ఆదేశాలివ్వాలని వినతి పత్రంలో కోరారు. అలాగే జర్నలిస్టుల వైద్య ఆరోగ్య సేవలకు అత్యధిక పాత్రికేయులకు సరైన వేతన వ్యవస్థ లేదని వారి ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.  సమాజంలో వివిధ వర్గాలకు ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహకారాన్ని పాత్రికేయులకూ అమలు చేసేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.  దాంతో స్పందించిన మంత్రి  వెల్లంపల్లి మీ సమస్యలను తప్పకుండా  ముఖ్యమంత్రి దృష్టి తీసుకు వెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జర్నలిస్ట్ లు కరోన నేపథ్యంలో ఏదుర్కొంటున్న సమస్యలపై సమచారశాఖ మంత్రి నానితో కూడా ఓసారి మాట్లాడతానని తెలిపారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
విజయవాడ ఏపీ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కామెంట్స్.. ఓవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్ కు కనిపించడం లేదా ముఖ్యమంత్రి జగన్ వారానికి ఒకటి...రెండు రోజులు స్కూల్ పెట్టడం ఏంటి ముఖ్యమంత్రి జగన్ బాద్యతారాహిత్యానికి ఇది నిదర్శనం పసిపిల్లల ప్రాణాలతో జగన్ ఆటలాడుకుంటున్నారు పిల్లలకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలి
Image
*వింజమూరు చెన్నకేశవస్వామికి ఆభరణం బహూకరణ* వింజమూరు, జూన్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని యర్రబల్లిపాళెంలో పురాతన చరిత్రను సంతరించుకున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారికి నడిమూరుకు చెందిన భక్తులు గురువారం నాడు బంగారు తాపడంతో చేసిన వెండి కిరీటమును, స్వామి అమ్మవార్లుకు పట్టు వస్త్రాలను బహూకరించారు. నడిమూరులో కీ.శే. యల్లాల.చినవెంకటరెడ్డి-ఆయన ధర్మపత్ని పుల్లమ్మల జ్ఞాపకార్ధం వారి కుమారులు యల్లాల.శ్రీనివాసులురెడ్డి, యల్లాల.రఘురామిరెడ్డి, యల్లాల.వెంకటరామిరెడ్డిలు కుటుంబ సమేతంగా దేవస్థానంకు చేరుకుని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు గణపం.వెంకటరమణారెడ్డి, గణపం.సుదర్శన్ రెడ్డి ల సమక్షంలో దేవదేవేరునికి అలంకరణ నిమిత్తం పూజారులకు అందజేశారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్ధం ప్రజలందరూ పాడిపంటలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని అర్చకులు రంగనాధస్వామి, వెంగయ్య పంతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అనిల్, భరత్, పునీత్, ఆశ్రిత్, ఫన్నీ, విరాజిత, రిత్విక తదితరులు పాల్గొన్నారు.
Image