కరోనా పరీక్షల్లో మరో ముందడుగు: మేకపాటి

కరోనా పరీక్షల్లో మరో ముందడుగు: మేకపాటి
అమరావతి : మహమ్మారి కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ కిట్లను కూడా ఉత్పత్తి చేస్తున్నట్లు పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. తద్వారా కరోనా నిర్ధారణ పరీక్షల్లో మరో ముందడుగు వేశామని.. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో వీటిని ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. రోజుకి 25 వేల మందికి పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి సరిపడా కిట్లు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. బుధవారం నుంచే థర్మల్‌ స్కానర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించగలిగామన్న మేకపాటి గౌతమ్‌రెడ్డి... అన్నిరాష్ట్రాల కంటే ఏపీలోనే కరోనా స్క్రీనింగ్‌ బాగా జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులన్నీ క్వారంటైన్‌లో ఉన్నవారికి సంబంధించినవేనని తెలిపారు. ఇక లాక్‌డౌన్‌ అమలు గురించి మాట్లాడుతూ.. రెడ్‌జోన్ లో ఉన్న పరిశ్రమలను తెరవడం లేదు. కేవలం గ్రీన్ జోన్ లో ఉన్న పరిశ్రమలకే అనుమతులిస్తున్నాం. ఇప్పటి వరకు 160 వరకు అనుమతులిచ్చాం. కార్మికుల రక్షణ కు జాగ్రత్తలు తీసుకున్నవారికే అనుమతిస్తున్నాం. ఎంఎస్ఎంఈ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు.  ఎంఎస్ఎంఈ రంగాన్ని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం’’ అని మేకపాటి హామీ ఇచ్చారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు