దువ్వూరు హనుమంత రామి రెడ్డి  జ్ఞాపకార్ధం వారి కుమారులు చే కూరగాయలు, పండ్లు పంపిణీ

ఈ రోజు (21.04.2020) చిట్టమూరు మండలం బురదగలి కోత్తపాళెం గ్రామంలో కీ//శే// దువ్వూరు హనుమంత రామి రెడ్డి  జ్ఞాపకార్ధం వారి కుమారులు దువ్వూరు శేషు రెడ్డి ,  దువ్వూరు రామ రాఘవ రెడ్డి , దువ్వూరు మణికంఠ రెడ్డి     సౌజన్యంతో 10 రకాల కూరగాయలు 6 టన్నులు,అరటిపండ్లు 11టన్నులు, కిరిణికాయలు 5 టన్నులు మండలం చుట్టు ప్రక్కల గ్రామాలలోని ప్రజలందరికీ పంపిణీలో పాల్గొన్న *గూడూరు ఎమ్మెల్యే డా//వెలగపల్లి వరప్రసాద రావు.


👉కరోనా వైరస్ గత కొన్ని వారాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధికారుల ద్వారా వారి శాఖల పరంగా ఏమేమి చేయాలో వాటిని చక్కగా అమలుపరుస్తున్నారని


👉144 సెక్షన్ పెట్టి పోలీసుల ద్వారా ప్రజలు బయటకు రాకుండా చూస్తున్నారని,


👉వాలంటీర్లు గ్రామాలలో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని,  


👉ప్రజలు నిత్యం చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని, 


👉ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలని, 


👉ఈ లాక్ డౌన్ వలన పనులు లేని పేద వారిని ఆదుకొనుటలో  భాగంగా ప్రభుత్వం పెన్షన్ సకాలంలో అందించుట, మూడు విడతలుగా ఉచిత రేషన్, నిత్యావసరాల కొనుగోలు కొరకు వెయ్యి రూపాయల నగదు పంపిణీ చేశామని  


👉ముఖ్యమంత్రి గారు నాయకులను మీ వంతుగా పేదలకు సహాయం చేయమని కోరగా ఆ మేరకు నాయకులు ముందుకు వచ్చి పేదలకు కూరగాయలు పంపిణీ చేస్తున్నారని 


👉శేషు రెడ్డి కుటుంబ సభ్యులకు తన తరపున ప్రజల తరపున కృతఙ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే .,
  ఈకార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సచివాలయం సిబ్బంది వాలంట్రీలు వైస్సార్సీపీ పార్టీ నాయకులు రాజా రెడ్డి గారు,వంక రమణయ్య గారు,మధు యాదవ్ గారు,మణి గారు,భాస్కర్  ఉన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు