జాగ్రత్త వహించకపోతే ప్రజలకు తీవ్ర నష్టం :గూడూరు పట్టణ సీఐ దశరథ రామారావు

*కరోనా ఎంతో దూరంలో లేదు*


*జాగ్రత్త వహించకపోతే ప్రజలకు తీవ్ర నష్టం*


*గూడూరు పట్టణ సీఐ దశరథ రామారావు*


*చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తూర్పు గూడూరులో శానిటేషన్*


*ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైయస్ఆర్ కాంగ్రెస్ యువనేత మండ్ల సురేష్ బాబు,సీఐ దశరథ రామారావు,ఎస్ఐ బ్రహ్మనాయుడు లు చేతుల మీదుగా శానిటేషన్ కార్యక్రమం ప్రారంభం*


*కరోనా వైరస్ గూడూరు పట్టణానికి కూడా రావడం దురదృష్టకరమని కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి స్వచ్చంధ సంస్థలు,ప్రభుత్వ యంత్రాంగం ప్రజల కోసం అహర్నిశలు శ్రమించి నా ఒకరిద్దరు చేసిన పొరపాటుకు గూడూరు కు కూడా వ్యాధి వ్యాపించడం జరిగిందన్నారు.ఇప్పటి కైన నష్టం ఏమి లేదని దయచేసి ప్రజలు బయటకు అడుగు పెట్టవద్దని సీఐ దశరథ రామారావు అన్నారు.గూడూరు పట్టణంలో నీ తూర్పు గూడూరులో చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శానిటేషన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.తూర్పు వీధి,పూల తోట గిరిజన కాలనీ,శివాలయం వీధి,పోలీస్ కొర్టస్ ప్రాంతాల్లో శానిటేషన్ నిర్వహించారు.ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ దశరథ రామారావు,ఎస్ ఐ  బ్రహ్మనాయుడు లు పాల్గొని శానిటేషన్ వాహనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చేగువేరా ఫౌండేషన్ ప్రజల ఆరోగ్యము కాపాడేందుకు తనవంతు కృషి చేస్తుందన్నారు.ఎస్ ఐ మాట్లాడుతూ అధికార యంత్రాంగం తో సమానంగా స్వచ్చంధ సంస్థలు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.అందులో చేగువేరా ఫౌండేషన్ మందు వరుసలో ఉందన్నారు.ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో పోలీసు,రెవెన్యూ,పారిశుధ్య,మునిసిపల్,పత్రికా సిబ్బంది సేవలు వెలకట్టలేనివన్నారు.ఈ కార్య క్రమంలో ఫౌండేన్ అధ్యక్షులు గుండాల అది నారాయణ,క్రాంతి కుమార్,మధు రెడ్డి, అన్సర్ భాష,నరేష్ రెడ్డి,పైలట్ టీం వినోద్,పవన్,భాస్కర్,అజయ్,సంతన్, సాయి మహేష్,లక్ష్మి నారాయణ,తరుణ్ తదితరులు పాల్గొన్నారు.*


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు