ఎన్నికలు జరిగి ఉంటే ఏపీ పరిస్థితిని ఊహించుకోండి:

ఎన్నికలు జరిగి ఉంటే ఏపీ పరిస్థితిని ఊహించుకోండి: బీజేపీ అధికార ప్రతినిధి
విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ అధికార ప్రతినిధి సాయి కృష్ణ ఆరోపించారు. తాము ఎన్నికల సంఘానికి ఆధారాలతో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఇదే సమయంలో కరోనా ముప్పును గుర్తించి రమేష్ కుమార్ వాయిదా వేశారని తెలిపారు. ఎన్నికలు జరిగి ఉంటే... ఎన్ని ప్రాణాలు పోయేవో... పరిస్థితి ఊహించుకోవాలని సాయికృష్ణ పేర్కొన్నారు. ఆనాడు వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు ఎన్నికల కమిషనర్‌ను దూషించారన్నారు. ఇప్పటికీ వాస్తవం గుర్తించకుండా తొలగించడం నీచమైన చర్య అని పేర్కొన్నారు. ప్రజలకు ఏవిధంగా మేలు చేయాలనేది చూడకుండా.. రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులు దాటకూడదనే ఆంక్షలు అమల్లో ఉన్నాయని సాయికృష్ణ గుర్తు చేశారు. మరి కొత్త ఎన్నికల కమిషనర్ చెన్నై నుంచి అమరావతికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వమే కేంద్రం ఆదేశాలను ఆచరించకపోతే... ప్రజలకు ఇంకేమి‌ చెబుతారని ప్రశ్నించారు. దేశం మొత్తం మీద ఏపీ సీఎం జగన్ మాత్రమే లాక్ డౌన్ అమలు.. జోన్ల వారీగా ఉండాలని చెప్పారంటే ప్రజల ఆరోగ్యంపై ఆయనకు బాధ్యత లేదా? అని నిలదీశారు. ఏప్రిల్ 30వరకు  లాక్ డౌన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని సాయికృష్ణ తెలిపారు.


Popular posts
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
Image
టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన వైయస్ఆర్ కాంగ్రెెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి. విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత శ్రీ మిథున్ రెడ్డి, ఎంపీలు శ్రీ నందిగం సురేష్, శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ మార్గాని భరత్..
Image