-----------------------
నెల్లూరు, 28-04-2020
నెల్లూరు జి.జి.హెచ్. లోని రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రిలో ఆధునాతన వైద్య సేవలు అందించడానికి తయారు చేసిన "నెల్ బాట్ " రోబోను.., ఏపీ ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు సయ్యద్ నిజాముద్దీన్, పర్వేజ్ హుస్సేన్..., జాయింట్ కలెక్టర్ డా. వి.వినోద్ కుమార్ కి అందించారు. నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం మధ్యాహ్నం జేసీ కలిసిన ఏపీ ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు..., వారు తయారుచేసిన రోబో ఐసోలేషన్ వార్డులో ఏ విధంగా పనిచేస్తుందో డెమో చేసి చూపించారు. డెమో అనంతరం మీడియాతో మాట్లాడిన జాయింట్ కలెక్టర్.., నెల్ బాట్ రోబో చాలా చక్కగా పనిచేస్తోందని.., ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న వారికి ఈ రోబో ద్వారా మెడిసిన్స్, వార్తా పత్రికలు, ఆహార పదార్థాలు అందించవచ్చన్నారు. దీనివలన ప్రతి చిన్న పనికి వైద్యులు, నర్సులు లోపలికి వెల్లనవసరం లేదని.., ఈ రోబో ద్వారా రోగులకు అవసరమైనవి ఐసోలేషన్ వార్డులోకి పంపించవచ్చన్నారు. దీంతో పాటు.., రోగులతో వారి బంధువులు మాట్లాడాలి అనుకున్నా.., ఈ రోబోలో వీడియో కాల్ చేయగలిగే సదుపాయం కూడా ఉందని, దీనిద్వారా రోగి వద్దకు వెల్లకుండానే వారితో మాట్లాడవచ్చని జేసీ తెలిపారు.