ప్రజలను అడ్డంగా దోచుకుంటున్న వ్యాపారస్తులు
ఎమ్మిగనూరు,ఏప్రిల్,28 (అంతిమతీర్పు):- ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనీ ఒక కూరగాయలు తప్పమిగతా నిత్యావసర సరుకులు అన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని నవాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.చికెన్ మరియు మటన్ వ్యాపారస్తులు సిండికేట్ గా ఏర్పడి ప్రజలనునిత్యందోచుకుంటున్నారని, అదే మాదిరిగా కిరాణం షాపుల్లో కూడా కొంతమంది వ్యాపారస్తులు అధిక ధరలకు అమ్ముతున్నారని నవాజ్ తెలిపారు.లాక్‌డౌన్ కారణంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూడా వ్యాపారస్తులు ఇలా చేయడం ఎంతవరకు సమంజసమనిపట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలను కిరాణా షాపుయజమానులునిత్యావసరసరుకులను,నిత్యావసర సరుకులు అయినా మంచి నూనెను కూడా అధిక ధరలకు అంటగట్టి అలా చేయడం సబబు కాదని ఇటువంటి సమయంలో ప్రజల దగ్గర నుంచి ఎటువంటి లాభాలు ఆశించకుండా ప్రజలకు నిత్యవసర సరుకులను ప్రజలకుప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే అందించాలని తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు వ్యాపారస్తులకు,మంచినూనెషాప్యజమానులకు,నిత్యావసర సరుకులు కిరాణా షాప్ యజమానులకు సూచించడం జరిగిందనినవాజ్ తెలిపారు.