గుంటూరు లో నేటి నుండి సరి సంఖ్య దినాల్లో వస్తువుల అమ్మకాలు : ఎస్.పి

.
     గుంటూరు లో నేటి నుండి సరి సంఖ్య దినాల్లో వస్తువుల అమ్మకాలు : ఎస్.పి


కోవిడ్ - 19 కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతి ఎక్కువగా ఉంటుంన్నందున, దానిని అరికట్టే దానిలో భాగంగా నిత్యావసరాలు నిమిత్తం మార్కెట్లు షాపులు ఇంక మీదట సరి సంఖ్య దినాలలో (2,4,6,8,10,12,14,16,18,20,22,24,26,28,30 తేదీలలో) పనిచేస్తాయని, బేస్ సంఖ్య దినాలలో(1,3,5,7,9,11,13,15,17,19,21,23,25,27,29,31 తేదీలలో) మార్కెట్లు, షాపులు ఉండవని గుంటూరు అర్బన్ పోలీసు అధికారి డిఐజి పి.హెచ్.డి రామకృష్ణ తెలియజేశారు.


 కనుక ప్రజలందరూ గమనించి రేపు 14 వ తారీఖున సరి సంఖ్య అయినందున మార్కెట్, షాపులు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు తీసి ఉంటాయని, ఎల్లుండి 15 వతేదీ నాడు మూసి ఉంటాయి కనుక కావలసిన అవసరాలు రేపటి రోజునే సమకూర్చు కోవాలసి ఉంటుంది.


 అదేవిధంగా రోజు మార్చి రోజు మార్కెట్లో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి గనుక కావలసిన పాలు,కూరగాయలు తెచ్చుకో వలసినదిగా, అదే విధంగా ద్విచక్ర వాహనం పైన ఒక్కరు, కారు వంటి వాహనం పైన ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, ఎవరు ఇంటి నుండి ఎవరు బయటకు రాకూడదని, నిత్య అవసరాల నిమిత్తం ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు వచ్చి, రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేసిన చోట్ల తీసుకొని త్వరగా ఇంటికి చేరుకోవాలని, మాస్కులు లేకుండా ఎవరు బయట తిరుగరాదని, మిగిలిన సమయాలలో మందుల షాపులు, అత్యవసర ఆసుపత్రులు మినహా మిగిలినవన్నీ మూసి వేయబడతాయని, గవర్నమెంట్ ఉద్యోగులు, ఆఫీసులకు వెళ్లేవారు ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు వెళ్లి, సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపుగా ఇండ్లకు చేరుకోవాలని, ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు ఇతరులు ఎవరు తిరుగరాదని, నిబంధనలు ఉల్లంఘించే వారి పైన వాహనాలు స్వాధీనం చేసుకుని, సంబంధిత చట్టాల మేరకు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోన బడతాయని,  గుంటూరు అర్బన్ పోలీస్ అధికారి  డిఐజి పీ.హెచ్.డి రామకృష్ణ తెలియ జేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు