లాక్‌డౌన్‌ పొడిగించండి: వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీని కోరిన సీఎంలు

లాక్‌డౌన్‌ పొడిగించండి: వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీని కోరిన సీఎంలు



   న్యూ ఢిల్లీ ;    కొవిడ్-19 వ్యాప్తి కట్టడి, లాక్ డౌన్ అమలుపై చర్చ ఆంక్షల సడలింపు లేక కొనసాగింపుపై సలహాలు తీసుకుంటున్న మోదీ
ఎఫ్ఆర్‌బీఎం పరిమితి, ఆర్థిక సాయంపై చర్చ
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  మాట్లాడుతున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. కొవిడ్-19 వ్యాప్తి కట్టడి, లాక్ డౌన్ అమలు, ఇప్పటివరకు విధించిన ఆంక్షల సడలింపు లేక కొనసాగింపు వంటి అంశాలపై కీలక చర్చలు జరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేసే విషయంపై కూడా చర్చిస్తున్నారు.  


మే 3 తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ఈ సందర్భంగా మోదీని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరారు. అలాగే, ఎఫ్ఆర్‌బీఎం పరిమితి, ఆర్థిక సాయం వంటి అంశాలను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తావించారు. దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తేయాలని ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.