వింజమూరు సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ

వింజమూరు సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ


వింజమూరు, ఏప్రిల్ 29 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని పలు ప్రాంతాలలో బుధవారం నాడు ట్రాక్టర్ల ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణమును పారిశుద్ధ్య సిబ్బంది పిచికారీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కరోనా వైరస్ నేపధ్యంలో మేజర్ పంచాయితీ అయిన వింజమూరులో పారిశుద్ధ్య పనులను రెట్టింపు స్థాయిలో చేయిస్తున్నామన్నారు. ప్రతినిత్యం 30 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులలో ఉంటూ డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయడం, బ్లీచింగ్ చల్లించడం లాంటి పనులు చేపడుతున్నారన్నారు. తాజాగా అంటు వ్యాధుల నిర్మూలనలో భాగంగా హైపోక్లోరైడ్ ద్రావణమును పంచాయితీ పరిధిలోని అన్ని ప్రాంతాలలో స్ప్రే చేయిస్తున్నామన్నారు. ప్రజలందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను కూడా పాటించాలని శ్రీనివాసులురెడ్డి కోరారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా ఎప్పటికప్పుడు చేతులను సబ్బులు, శానిటైజర్లతో శుభ్రంగా ఉంచుకుని విధిగా మాస్కులను ధరించాలని విజ్ఞప్తి చేశారు.