అమరావతి ఏప్రిల్ 28 (అంతిమ తీర్పు) ;
దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్.ఫీజు రీఇంబర్స్‌మెంట్ కింద మొత్తం రూ. 4,000 కోట్లకు పైగా విడుదల.గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1,880 కోట్ల బకాయిలు కూడా చెల్లింపు.12 లక్షల మంది తల్లులకు తద్వారా వారి పిల్లలకు లబ్ది.
నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హమీని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మరో పధకాన్ని నేడు ప్రారంభించనున్నారు. దేశచరిత్రలోనే తొలిసారిగా పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్ పధకం *జగనన్న విద్యాదీవెన* పధకాన్ని నేడు క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించనున్నారు. పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఈ పధకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెడుతున్నారు. కరోనా కష్టాలు ఉన్నా పెద్ద చదువులు చదువుతున్న విద్యార్ధులకు పూర్తి పీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది.
12 లక్షల మంది తల్లులకు తద్వారా వారి పిల్లలకు ఈ పధకం ద్వారా లబ్దిపొందనున్నారు. అన్ని త్రైమాసికాలకు సంబంధించి చెల్లించవలిసిన ఫీజులు బకాయిలు లేకుండా ఒకే ఆర్దిక సంవత్సరంలో చెల్లించనున్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా తల్లులకు, వారి పిల్లల చదువుల కోసం కేవలం 11 నెలల కాలంలోనే దాదాపు రూ.12,000 కోట్లు ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన పధకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం తాజాగా జగనన్న విద్యాదీవెన పధకాన్ని ఈరోజు ప్రారంభించనుంది.