_మాస్కులు ధరించకుండా ఇల్లు దాటితే శిక్షార్హులే - కృష్ణ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్

*కృష్ణ జిల్లా*


_మాస్కులు ధరించకుండా ఇల్లు దాటితే శిక్షార్హులే - కలెక్టర్ ఇంతియాజ్


★ కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ . ఎండి . ఇంతియాజ్ తెలిపారు.


★ కరోనా నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై  కలెక్టర్ ఇంతియాజ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.


_*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...*_


★ ప్రజా ఆరోగ్యాన్ని , కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.


★ ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి మూడు చొప్పున మాస్కులు అందించనున్నట్లు చెప్పారు.


★ మాస్కు ధరిస్తే తమతో పాటు తమ కుటుంబ సభ్యులు , తమ పొరుగువారు కూడా సురక్షితంగా ఉంటారన్నారు. దానితో పాటు వారి శ్రేయస్సును కోరిన వారవుతారన్నారు.


★ జిల్లాలో రెడ్ జోన్ గా ఉన్న విజయవాడ , పెనమలూరు . గొల్లపూడి , జగ్గయ్యపేట , మచిలీపట్నం , నూజివీడు మండలాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆయన కోరారు.


★ మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.


★ ముఖ్యమంత్రి వై . యస్ . జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి కుంటుంబంలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు చొప్పున అందిస్తామన్నారు.


★ రెడ్ జోన్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ముందుగా పంపిణీ చేస్తామని చెప్పారు.


★ జిల్లా వ్యాప్తంగా మాస్కుల పంపిణీకి డ్వామా , డిఆర్డిఎ ఆధ్వర్యంలో స్వయం సహాయ సంఘాల ద్వారా పెద్ద ఎత్తున మాస్కులు తయారీ చేపట్టామన్నారు.