కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసిన సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ : ఏపీలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలను స్వస్థలాలకు పంపడంలో వివక్ష ఎందుకు?
ఇటలీ నుండి 33 మంది విద్యార్ధులను తీసుకురావడంలో మీరు, వారణాసి నుండి 1000 మంది యాత్రికులను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడంలో ఎంపి జివిఎల్ నరసింహారావు గారు చొరవ చూపారు.
ఇటీవల గుంటూరు జిల్లాలో ఉన్న కర్నూలుకు చెందిన వలస కూలీలను కర్నూలుకు వెళ్ళనీయకుండా మార్గమధ్యం నుండి పోలీసులు వెనక్కి తిప్పి పంపారు.
హైదరాబాద్, బెంగళూరులో ఉన్నవలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు ఆటంకాలు కల్పిస్తున్నారు.
మీరు తక్షణమే లాక్ డౌన్ పొడిగించేలోపు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వలసకూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.
- రామకృష్ణ.