గడ‌చిన వందేళ్ల‌లో ఇలాంటి పరిస్థితులు రాలేదు : తితిదే ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి 

గడ‌చిన వందేళ్ల‌లో ఇలాంటి పరిస్థితులు రాలేదు
* తితిదే ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి 
తిరుమ‌ల‌: గడ‌చిన వందేళ్ల‌లో ఎన్న‌డూ ఇలాంటి పరిస్థితులు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో రాలేదని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘కరోనా’, ‘లాక్ డౌన్’ నేపథ్యంలో భక్తులకు దర్శనాలు ఆపేసి ఇప్పటికి 45 రోజులైంద‌న్నారు. ప్రతి నెలా వచ్చే హుండీ ఆదాయం, సేవా కార్యక్రమాలు, కల్యాణోత్సవాలు, ప్రసాదాలు, రూమ్ రెంట్స్.. ఇలా వీటి ద్వారా వచ్చే ఆదాయం సుమారు రూ.150 నుంచి రూ.175 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆదాయ వనరులకు లోటు ఏర్పడిందని, రాబోయే కాలంలో ఎలా పూడ్చుకోవాలనే విషయమై ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. రాబోయే కాలంలో టీటీడీ ఖర్చులు, వ్యయాలు తగ్గించే విషయమై అధికారులు, ఉద్యోగస్తులు, పాలక మండలి సభ్యులు సహకరిస్తారని ఆశించారు. పాలక మండలి సభ్యులు, చైర్మన్‌గా తాను కూడా జీతాలు తీసుకోలేదని గుర్తుచేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు