నగిరి మునిసిపల్‌ కమిషనర్‌  వెంటకరామిరెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు...

నగిరి మునిసిపల్‌ కమిషనర్‌  వెంటకరామిరెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు...
  (అమరావతి) నగిరి మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటరామిరెడ్డిని ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. కరోనా రక్షణ పరికరాలు లేవంటూ వెంకటరామిరెడ్డి సెల్పీ వీడియో కలకలం రేపడంతో వెంకటరామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్ధానంలో ఇన్‌చార్జ్ కమిషనర్‌గా సానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావును నియామించారు. నగరిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తమకు రక్షణ కవచాలు లేవంటూ ఆయన సెల్పీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. రెండు రోజుల క్రితం నర్సీపట్నం ఆసుపత్రి వైద్యుడు సుధాకర్ చేసిన వ్యాఖ్యలతో పాటు వెంకటరామిరెడ్డి చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ ఇద్దరి వ్యాఖ్యలు అటు వైద్యశాఖలో ఇటు మున్సిపల్ శాఖ ఉద్యోగల పరిస్థితి ఎలా ఉందో అనే విషయం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.


పాజిటివ్ కేసులు నమోదవుతున్న పట్టణాల్లో ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండా ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి వస్తోందని వెంకటరామిరెడ్డి వాపోయారు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో డబ్బులు ఖర్చు చేద్దామనుకుంటే అకౌంట్ ప్రీజ్ అయి ఉందని దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రోజా ఇచ్చిన డబ్బులతోనే తాము సహాయక కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. వెంటకరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రసార మాధ్యమాల్లో, పత్రికల్లో ప్రచారమయ్యాయి. ఈ సెల్పీ వీడియో ప్రభుత్వం దృష్టికి పోయింది. వెంకటరామిరెడ్డి ప్రభుత్వం నింబంధనలు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆయనపై ప్రభుత్వం వేటు వేసింది.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు