లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలకు రేషన్ సరుకులు పంపిణీ
ఎమ్మిగనూరు,టౌన్,ఏప్రిల్ 14 (అంతిమతీర్పు):-మన దేశ ప్రజల ప్రాణాలను కబలిస్తున్న కరోన వైరస్ ధాటికి పట్టణ,గ్రామీణ ప్రాంత ప్రజలు అడుగు బయట పెట్టలేని తరుణంలో స్థానిక హెచ్ బి ఎస్ కాలనీ ప్రజల సమస్యలను తెలుసుకునిఎమ్మిగనూరు టిడిపి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బివి. జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు తెదేపా పట్టణ యువ నాయకులు దయాసాగర్ 21వ వార్డులోని పిరమిడ్,పెద్దాసుపత్రి,గీతమందిరం, ఆడివప్పమఠం దగ్గర తదితర ప్రాంతాల్లో నివసించే నిరుపేద కుటుంబాలు అయినా చెయ్యి ఆడితే గానీ డొక్కాడని పరిస్థితి గల నిరుపేద కుటుంబాలు గల సుమారు 250 కుటుంబాల వారికి కావాల్సిన బియ్యం,బ్యాళ్లు, కారం,గోధుమపిండి, ఉప్మారవ్వ,సన్ ఫ్లవర్ ఆయిల్,2 dettol సబ్బులు పంపిణీ చేయడం జరిగిందని టిడిపి యువ నాయకులు దయాసాగర్ తెలిపారు.ఈ సందర్భంగా వారికి కాలనీవాసులు హృదయ పూర్వక ధన్యవాదాలుతెలుపుతూ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాబట్టి ఇలాంటి సమయంలో మీ సేవలు మాకు ఎంతో అవసరమని ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నెన్నో చేయాలని కాలనీవాసులు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్, రవి,విజయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.