లాక్ డౌన్ సమయంలో వింజమూరు జర్నలిస్టులు కృషి అనిర్వచనీయం : ఎస్.ఐ బాజిరెడ్డి, వై.సి.పి నేతల ప్రశంసలు
వింజమూరు, ఏప్రిల్ 28 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో లాక్ డౌన్ సమయంలో స్థానిక జర్నలిస్టులు ప్రభుత్వాధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా విశేష రీతిలో ఎప్పటికప్పుడు వార్తలను చేరవేస్తూ విశేషంగా కృషి చేశారని వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్ది కొనియాడారు. మంగళవారం సాయంత్రం స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వార్తల విషయంలో వింజమూరు జర్నలిస్టులు విశేష ప్రతిభను కనబరచడం గమనించామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించినప్పటి నుండి కూడా వింజమూరు జర్నలిస్టులు మాత్రం నిత్యం ప్రభుత్వ శాఖలతో పాటు వారి వారి విధులు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. వై.సి.పి మాజీ మండల కన్వీనర్, మండల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యం.పి.పి అభ్యర్ధి పల్లాల.కొండారెడ్డి మాట్లాడుతూ వింజమూరు జర్నలిస్టులు తనకు ఆత్మబంధువులుగా అభివర్ణించారు. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ఎండలను సైతం లెక్కచేయకుండా మండలంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నా స్వీయ నిర్భంధంలో ఉన్న ప్రజలకు ప్రసార సాధనాలు, వాట్సప్ గ్రూపుల ద్వారా తెలియపరుస్తూ జర్నలిజం పరంగా ఎనలేని సేవలు అందిస్తున్న ఘనత స్థానిక విలేకరులకే స్వంతమన్నారు. వింజమూరు జర్నలిస్టులకు అండదండలు అందించేందుకు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ముందుంటుందన్నారు.
సొసైటీ అధ్యక్షులు మద్దూరి.చిన్నిక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ విధుల పట్ల వింజమూరు జర్నలిస్టులు అంకితభావాలు కలిగి ఉండటం గొప్ప విషయమన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ సమయాలలో కరోనా మహమ్మారిని లెక్కచేయక ప్రజలకు వార్తలను చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు తమతో పాటు ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారన్నారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డిల ఆదేశాలు, ఆశయాల మేరకు జర్నలిస్టులతో పాటు మండల ప్రజలందరికీ విశేషంగా సేవలు అందిస్తున్నామని, ముందు ముందు కూడా ఇదే తరహాలో ప్రయాణం చేస్తుంటామని చిన్నిక్రిష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి బంకా.శ్రీనివాసులురెడ్డి, వై.సి.పి నేతలు పోరెడ్డి.జగన్ రెడ్డి, సూరం.వెంకటేశ్వర్లురెడ్డి, గోపిరెడ్డి.రమణారెడ్డి, బువ్వన.కొండారెడ్డి, అన్నపురెడ్డి.శ్రీనివాసులురెడ్డి, మద్దూరి.బాలక్రిష్ణారెడ్డి, సూరం.సుధాకర్ రెడ్డి, దాదిబత్తిన.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.