కౌతాళం ఎంఈఓ గా బాధ్యతలు చేపట్టిన సునంద కౌతాళం,ఏప్రిల్,13 (అంతిమతీర్పు):-కౌతాళం మండల ఎంఈఓ కార్యాలయంలో మండల ఉపాధ్యాయుల సమక్షంలో మండల ఎంఈఓ గా వై.సునంద బాధ్యతలు చేపట్టారు.ఎంఈవో సునంద మాట్లాడుతూ కౌతాళం మండలంలో ఉన్న తదితర గ్రామాల్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థుల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటట్లు చూడాలని మండల ఉపాధ్యాయులను కోరారు.విద్యార్థుల్లో ఎక్కువగా నైపుణ్యత జనరల్ నాలెడ్జ్ ని పెంచి చదువులో మంచి ర్యాంకులు సంపాదించేటట్లు చూసే బాధ్యత ప్రతి ఉపాధ్యాయుల దేనని ఆమె పేర్కొన్నారు.పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు సక్రమంగాఉండేటట్లు చూడాలని కోరారు.
కౌతాళం ఎంఈఓ గా బాధ్యతలు చేపట్టిన సునంద