*అరటి తోటల రైతుల ఆక్రందన*
వరికుంటపాడు
అరటి గెలలను అమ్ముకోడానికి మార్కెట్ సౌకర్యం లేకపోవడం తో విధి లేక పక్వానికి వచ్చిన అరటి గెలలని విక్రయించేందుకు ఊర్ల వెంబడి తిరుగుతున్నారు హృదయం కరిగించే సంఘటన ఇది. వివరాలు ఇలా ఉన్నాయి, కడప జిల్లా పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన అరటి రైతులు పంటను ఆశాజనకం గా పండించారు. కరోనా మహమ్మారి పుణ్యమా అని ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యం లో పండించిన పంట ను సకాలం లో విక్రయించుకోలేక అరటి గెలలను వ్యాన్ లో ఉంచి ఊరూరా విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం వరికుంటపాడు మండలం గువ్వడికి వచ్చి గెల 120 వంతున విక్రయించారు, ఈ సందర్బంగా 'అంతిమ తీర్పు' అరటి రైతు కృష్ణారెడ్డి ని పలకరించగా తమ గోడు ని వెళ్లబోసుకున్నాడు. గెల మార్కెట్ లో 400 పలుకుతుంది అని తాము ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై పంపించే వారిమీ అని పరిస్థితుల ప్రభావం వలన గ్రామాలకి వచ్చి విక్రయించుకునే దుస్థితి ఏర్పడింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
అరటి తోటల రైతుల ఆక్రందన