జాలవడి లో పేకాట రాయుళ్లు అరెస్టు
ఎమ్మిగనూరు, పెద్దకడబూరు,ఏప్రిల్,13( అంతిమతీర్పు):-పెద్దకడబూరు మండల పరిధిలోని జాలవడి గ్రామ అటవీ ప్రాంతమైన గాడిదవంక దగ్గర పంటపొలాల్లో జాలవడి గ్రామానికి చెందిన 14 మంది వ్యక్తులు పేకాట ఆడుతుండగా పెద్దకడబూరు పోలీసులు సమాచారం అందుకుని పేకాట ఆడుతున్న వారిని ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.వారి వద్ద నుండి 17,655 రూపాయలు నగదు,వారి వద్ద నుండి 12 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పెద్దకడబూరు ఎస్ఐ అశోక్ తెలిపారు.