మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.

*మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
*దివాళా తీసిన బత్తాయి రైతు*
*ఉదయగిరి, ఏప్రిల్ 6 (అంతిమతీర్పు ఇంచార్జ్-దయాకర్ రెడ్డి):: రాష్ట్రము లోనే బత్తాయి పంట కు ప్రసిద్ధి చెందిన వరికుంటపాడు మండలం లో ఆ పంట ను సాగు చేస్తున్న రైతు లు దివాళా తీస్తున్నారు. ఆరుగాలం శ్రమించి రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన బత్తాయిలు చేతికి వచ్చే దశ లో కరోనా ఉపద్రవం తొ కుదేలు అయిపోయారు. మండలం లోని రామాపురం, కాకోళ్ళువారిపల్లి, హుస్సేన్నగర్, వేంపాడు, అశోక్ నగర్, తూర్పు రొంపిదొడ్ల, నరసింహపురం, పామూరు పల్లి, పెద్దిరెడ్డిపల్లి, కొండాయపాలెం, కృష్ణంరాజుపల్లి, కాంచెరువు గ్రామాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాలు కి పై బడి బత్తాయి తోట ని సాగు చేస్తున్నారు, ప్రతి ఏడాది మార్చ్, ఏప్రిల్ మాసాలలో నాణ్యమైన బత్తాయి కాయలు దిగుబడి అవుతాయి, కరోనా మహమ్మారి పుణ్యమా అని పంట ని కొనే వాడు లేకపోవడం రవాణా వ్యవస్థ స్తంభించి పోవడం తొ రైతు లు పరిస్థితి అగమ్యగోచరం గా మారింది. వేసవి మాసం వచ్చింది అంటే ఈ ప్రాంతం లోని రంగపురి రకం బత్తాయి లకు అధిక ప్రాధాన్యత ఉండేది. అయితే కరోనా దెబ్బకు ఎవరు బత్తాయి కొనుగోలు కి మొగ్గు చూపడం లేదు, ఫలితం గా నేల  రాలి పోతున్నాయి. గత ఏడాది ఇదే సీజన్లో టన్ను బత్తాయి ముప్పై వేలు ధర పలికింది అలాంటి పంట ఇప్పుడు కొనే వారు, అమ్మే వారు లేకపోవడం బాధాకరం. ఈ మాసాలలో నిత్యం కలకత్తా, ముంబై, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాలకు వందల సంఖ్య లో బత్తాయి లోడ్ లు ఎగుమతి అయేవి, కానీ ప్రస్తుతం కొనుగోలు కోసం అడ్వాన్స్ లు ఇచ్చిన దళారులు కూడా మొఖం చాటేస్తున్నారు ఈ దెబ్బ తొ లక్ష లాది రూపాయలు పెట్టుబడి పెట్టి బత్తాయి సాగు చేసిన రైతు లు నిండా మునిగి పోయారు. రాయల సీమ లో చీనీ కాయలు గా తెలంగాణ లో మోసంబి గా పిలుచుకునే ఈ బత్తాయి లు ను  ప్రభుత్వం ఉద్యాన వన శాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలి అని రైతులు కోరుతున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు