జర్నలిస్టుల పాత్ర ఎనలేనిది: డాక్టర్ మాలిక్ ఎం.డి తాహా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్

 


జర్నలిస్టుల పాత్ర ఎనలేనిది: డాక్టర్ మాలిక్ ఎం.డి
తాహా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్


జర్నలిస్టులకు ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలి.. 
▪️ముఖ్యమంత్రి జగన్ జర్నలిస్టులను ఆదుకోవాలి..
-మచ్చా రామలింగారెడ్డి
 జాతీయ సభ్యులు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) విజ్ఞప్తి..


👉అనంతపురం ప్రెస్ క్లబ్ లో శ్యానిటైజర్లు, సబ్బులు, మాస్కులు పంపిణీ..
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


👉జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం నగరంలోని జర్నలిస్టులకు తాహా ఆయుర్వేదిక్ హాస్పిటల్ సహకారంతో శ్యానిటైజర్లు, మాస్కులు, సబ్బులు.. జర్నలిస్టులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ మాలిక్, మచ్చా రామలింగారెడ్డి జాతీయ సభ్యులు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్.. పాల్గొని వారి చేతుల మీదుగా జర్నలిస్టులకు పంపిణీ కార్యక్రమం జరిగింది.


✍డాక్టర్ మాలిక్ ఎం.డి మాట్లాడుతూ కరోనా నియంత్రణలో వార్తల సేకరణలో ఎప్పటికప్పుడు ప్రజలకు వార్తలు అందిస్తూ... ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని వారి సేవలు వెలకట్టలేనివి అని అన్నారు, మీ నాయకుడు మచ్చా రామలింగారెడ్డి ఆడిగినవెంటనే రెండు రోజుల్లోనే శ్యానిటైజర్లు, సబ్బులు, ప్రత్యేకంగా తయారు చేశామని డాక్టర్ మాలిక్ తాహ ఆయుర్వేదిక్  హాస్పిటల్ ఎం.డి అన్నారు.


✍మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రాణానికి తెగించి కరోనా వార్తలు ఇస్తున్నారని ప్రభుత్వం  గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు జర్నలిస్టులను వెంటనే ఆదుకోవాలని, జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ వార్డు వాలంటీర్ల మాదిరిగా జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి ప్రభుత్వం నుంచి అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు🙏


👉ఈ కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ కార్యదర్శి కె.విజయరాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డి.శివప్రసాద్, భాస్కర్ రెడ్డి, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు మారుతీ, ఆనంద్ కుమార్ (SKU), డ్యానీయల్, హరికృష్ణ, సొసైటీ సభ్యులు సతీష్, దిలీప్, కుల్లాయిస్వామి, మీడియా ఎంప్లాయిస్ నాయకులు ఆదినారాయణ, కృష్ణమూర్తి, ఆంధ్రజ్యోతి రామారావు, కృష్ణ, కెమెరామెన్లు శ్రీనివాస్, సుధాకర్,రాజశేఖర్,బాలు, షాకిర్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.


💎DIST.. JOURNALIST DEVELOPMENT SOCIETY, ANANTAPURAMU💎


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు