విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్
ఎఫ్ డి సి చైర్మన్ విజయ్ చందర్ ఘన నివాళులు
విజయవాడ, ఏప్రిల్ 29: బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ది చైర్మన్ శ్రీ టి.ఎస్.విజయ్ చందర్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసారు. ఇర్ఫాన్ బాలీవుడ్ సినిమాలే కాకుండా స్లమ్‌డాగ్ మిలియనీర్, ఎ మైటీ హార్ట్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై వంటి హాలీవుడ్ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారని ఆయన అన్నారు. సినీ రంగానికి ఇర్ఫాన్ ఖాన్ చేసిన సేవలు మరువలేనివని విజయ్ చందర్ కొనియాడారు. సినీ రంగానికి ఇర్ఫాన్ ఖాన్ లేని లోటు తీర్చలేనిదని విజయ్ చందర్ అన్నారు. ఇర్ఫాన్ ఖాన్ మొదటి సినిమా ‘సలామ్ బాంబే’ అయితే, తెలుగులో కూడా మహేష్ బాబు హీరోగా ఉన్న సైనికుడు సినిమాలో నటించారని , తెలుగు పరిశ్రమతో కూడా ఆయనకు అవినాభావ సంబంధం ఉందని ఎఫ్ డి సి చైర్మన్ తెలిపారు. ఇర్ఫాన్ కుటుంబ సభ్యులకు విజయ్ చందర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.