పేద కుటుంబాల్ని ఆదుకోండి - ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ 

ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాల్ని ఆదుకోండి. ఎమ్మెల్సీ *యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్*


 *పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామములో* మండల అధ్యక్షులు వీరపనేని శివరాం గారి  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ గౌతు లచ్చన్న గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తోట్ల వల్లూరు మండలం అన్ని గ్రామాల పేదలకు సుమారు 8000 వేల కుటుంబాలకు  నిత్యావసర సరుకులు పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ *రాజేంద్ర ప్రసాద్* 


ఈ సందర్భంగా *రాజేంద్రప్రసాద్* మాట్లాడుతూ లచ్చన్న గారు అప్పట్లో  అణగారిన వర్గాల్లో  విద్య బుద్దులు నేర్పి చైతన్యం తీసుకువచ్చారని, రాజకీయంగా కూడా తన గురువు ఎన్.ది  రంగా గారి కోసం తన ఎంపీ పదవిని తృణ ప్రాయంగా వదులుకున్న గొప్ప నాయకుడని ఈ రోజుల్లో ఆయన్ని అందరూ ఆదర్శంగా తీసుకొనే సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని అన్నారు. అలాగే కరోనా కష్ట సమయంలో వల్లూరు మండలం మొత్తం అన్ని గ్రామాలకు ఇంటింటికి సరుకులు పంచుతున్న శివరాం ని అభినందిస్తున్నానని *రాజేంద్రప్రసాద్* అన్నారు. 


ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా B.C.సెల్ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి,  వల్లూరి కిరణ్  పెనమకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు  పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు