విద్యా వ్యవస్థను దిగజార్చిన జగన్‌ : తెలుగుదేశం నేత కళా వెంకట్రావు

తేది : 28.04.2020
త్ప్ర
విద్యా వ్యవస్థను దిగజార్చిన జగన్‌ : కళా వెంకట్రావు
1. అమ్మ ఒడి + వసతి దీవెన + విద్యాదీవెన పథకాల ద్వారా ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి లక్షా 50 వేల రూపాయలు ఇస్తానని జగన్‌ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.
2. అమ్మ ఒడి రూ.15,000 + ఫీజు రీయంబర్స్‌మెంట్‌ రూ.35,000 + వసతి దీవెన రూ.20,000... ఈ మూడు కలిపితే రూ.70 వేలు మాత్రమే. లక్షా 50 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి రూ.70 వేలకు కోత కోయడం మోసం చేయడం కాదా? మడమ తిప్పడం కాదా? ఈ మోసాన్ని కప్పిపెట్టుకొనేందుకు జాతీయ మీడియాలో పెద్ద అడ్వర్‌టైజ్‌మెంట్లతో ప్రజాధనం దుర్వినియోగం... పైగా గత ప్రభుత్వంపై నిందలు.
3. 5 ఏళ్లలో ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు వైయస్‌ ప్రభుత్వం రూ.2,500 కోట్లు ఖర్చు పెట్టింది. మరో రూ.2,400 కోట్లు బకాయి పెట్టింది. ఈ బకాయిని రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం చెల్లించింది వాస్తవం కాదా?
4. చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క ఫీజు రీయంబర్స్‌మెంట్‌కే రూ.16 వేల కోట్లు ఖర్చు పెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.2,400 కోట్లు చెల్లించారు.
5. ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు చంద్రబాబు ప్రభుత్వం రూ.45 వేలు ఇస్తే, దాన్ని జగన్‌ రూ.35 వేలకు తగ్గించింది వాస్తవం కాదా? దీనితో విద్యార్థిల్ని, విద్యా సంస్థల్ని సంక్షోభంలోకి నెట్టినట్లు కాదా?
6. అమ్మ ఒడి 60 లక్షల మంది అర్హులుంటే 43 లక్షల మందికే కుదించింది జగన్‌ ప్రభుత్వం కాదా!
7. విద్యా సంస్థలకు వైకాపా పార్టీ రంగు కొట్టి, ఉపాధ్యాయుకు, లెక్చరర్లకు జీతాల్లో 50% కోతకోసి, ఎన్నికల కోసం పరీక్షలు వాయిదా వేసి విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారు.
8. చంద్రబాబు రెండు డీయస్సీలు జరిపి 17 వేల ఉపాధ్యాయ నియామకాలు చేశారు. ప్రొఫెసర్లు, లెక్చరర్లు వగైరా టీచింగ్‌ పోస్టులు 2,500 భర్తీ చేశారు. 3,640 డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, 1,217 వర్చువల్‌ క్లాస్‌రూమ్‌లు, జూనియర్‌ కాలేజీలకు 100% వైఫై, విద్యార్థినులకు 5.61 లక్షల సైకిళ్లు ఇచ్చారు. మున్సిపల్‌ పాఠశాలల్లో తెలుగుతోపాటు చంద్రన్న ప్రభుత్వం ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టింది.
9. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు విదేశీ విద్యకు రూ.10 లక్షలు ఇచ్చారు.
10. చంద్రబాబు 5 ఏళ్లలో విద్యా రంగానికి 1 లక్షా 10 వేల కోట్ల బడ్జెట్‌ ఇచ్చారు. వైఎస్‌ విద్యకు బడ్జెట్‌లో 5% ఖర్చు చేయగా, చంద్రన్న దాన్ని 10%కు పెంచారు.
11. యూనివర్సిటీ పాలకమండళ్ల నియామకంలో జగన్‌ సామాజిక న్యాయాన్ని మంటగలిపారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు