తాడేపల్లి, ఏప్రిల్ 21.( అంతిమతీీర్పు) :
*పార్టీ ఎంఎల్ ఏ శ్రీ కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్*...
*కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు*.
*కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు అర్ధ రహితం
కిట్స్ కొనుగోళ్లలో ఎటువంటి లోపాలకు తావివ్వకుండా ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళ్తుంది
---------------------------------------------------
పార్టీ ఎంఎల్ ఏ కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఏమన్నారంటే....ఆయన మాటల్లోనే.....
కరోనా యావత్ మానవజాతిని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచంలోఅత్యంత బలమైన దేశాలు అమెరికా,ఫ్రాన్స్,ఇటలీ,స్పెయిన్ వంటి దేశాలు కూడా కుదేలవుతున్నాయి.
137కోట్ల భారతదేశంలో సైతం ప్రధాన నరేంద్రమోది,మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్స్వి,యనిర్భంధం అని పెట్టి కరోనాను అరికట్టేవిధంగా పనిచేస్తుంటే కొందరు రాజకీయనేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.
ప్రపంచంమారింది...పచ్చకామెర్ల వాళ్లు...చంద్రబాబుగారు మారడం లేదు.బాధకలిగించే విషయం ఏమంటే చంద్రబాబు లాంటి వారికి వత్తాసు పలుకుతూ కన్నాలక్ష్మీనారాయణ మాట్లాడటం బాధకలుగుతోంది.
ఇది అందరికి తెలిసిందే...లాక్ డౌన్ వల్ల వ్యాధిని మరింత ప్రబలకుండా చేస్తున్నాం.కాని వ్యాధి వచ్చినవారికి నిర్ధారణ చేసి నియంత్రణ చేయాలి.
నిర్ధారణ చేయాలంటే పరీక్ష కిట్స్ అవసరం.అవి అవసరానికి సరిపడాలేవు ఏ రాష్ర్టానికి ఆ రాష్ర్టం తెప్పించుకోండి అని స్వయంగా ప్రధానిగారి మీటింగ్ లో అమిత్ షాగారు చెబితే మన ముఖ్యమంత్రిగారు,అధికారులు వెంటనే నిర్ణయం తీసుకుని రెండులక్షల టెస్టింగ్ కిట్స్ ను ఒక్కొక్కటి 730 రూపాయలకు ఆర్డర్ చేయడం జరిగింది.
కేంద్రం ఏ కిట్స్ నైతే 790 రూపాయలకు ఆర్డర్ చేసిందో మనం ఇంకా బేరమాడి 730 రూపాయలకు ఆ కిట్స్ తెచ్చుకోవడం జరిగింది.
పైగా 25 శాతం మాత్రమే పేమెంట్ చేసి,మిగిలిన మొత్తం ఇవే కిట్స్ ను వేరే రాష్ర్టాలకు తక్కువధరకు ఇస్తే మేం ఆ ధరే చెల్లిస్తామనే నిబంధనను కూడా విధించింది.ఇంత సంక్లిష్టపరిస్దితులలో కూడా జాగ్రత్తలు తీసుకుంది.
దానికి కూడా వీరు విమర్శలు చేస్తున్నారంటే ప్రజలు అర్దం చేసుకోవాలి.మేం ఏమీ తప్పుపట్టడంలేదు.కేంద్రప్రభుత్వం 790 రూపాయలకు కొనిందని మేం తప్పుపట్టడం లేదు.ఆరోజున అది అవసరం అయి ఉండవచ్చు.ఆరోజున అది రేటు ఐఉండవచ్చు.
ఎలా ఉంటుందంటే డిమాండ్ ,ప్రొడక్షన్ పెరిగే కొలది రేట్లు మార్కెట్ లో తగ్గుతుంటాయి.రేపు రేట్లు మారుతూ ఉండవచ్చు పెరగవచ్చు,తగ్గవచ్చు.కాని కేంద్రప్రభుత్వం కొన్నదానికంటే తక్కువధరకు కొన్నాం అని చెబుతున్నాం.
ఈరోజు మీరు చూడండి భారతదేశంలో టెస్ట్ లు జరుగుతున్నాయి.కేంద్రప్రభుత్వం షుమారు 3 లక్షల 84 వేల టెస్ట్ లు చేసింది.అంటే ప్రతి పదిలక్షలలో మీరు సగటు తీసుకుంటే 270 మందికి చేశారు.
అదే రాష్ర్టాలలో తీసుకుంటే మొట్టమొదటి స్ధానంలో రాజస్ధాన్ ఉంది.ప్రతి పదిలక్షలమందిలో 749 మందికి వారు పరీక్షలు చేసారు.రెెండోస్ధానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.ప్రతి పదిలక్షలమందిలో 629 మందికి పరీక్షలు చేసింది.
నేను ఇందాక చెప్పినట్లు వ్యాధి నిర్ధారణ చేసుకుని క్వారంటైన్ కు పంపి ఆ తర్వాత కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అన్ని రకాల చర్యలు చేపడుతుంటే టిడిపి నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.
జగన్ గారి ప్రభుత్వం టెస్టింగ్ కిట్స్ తేవడంలో వైఫల్యం చెంది ఉంటే,ఇంకా అధికధర పెట్టి కొని ఉంటే మీరు విమర్శించినా ఒప్పుకుంటాం.
ప్రభుత్వం పారదర్శకంగా చేస్తుంటే కేవలం ఆత్మస్ధైర్యం దెబ్బతీయాలి,ఎప్పుడులాగే గ్లోబెల్ ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్నిఅభాసుపాలు చేయాలని తప్పితే వేరేదేమైనా ఉందా ఇక్కడ.
ప్రజలకు అన్ని తెలుసు.అందుకే శ్రీవైయస్ జగన్ గారిని అఖండ మెజారిటితో గెలిపించారు.కన్నాగారు అంటారు.....కరోనా వ్యాప్తికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే కారణం అంట.అదే రోజు పక్కనే పైన పేజీలో టిడిపినేత సబ్బం హరి గారు....కరోనాను జగన్ గారు తెలుసుకోలేకపోయారు అందుకే అది వ్యాప్తి చెందుతోంది.అసలు ఇద్దరు కలిపి ఒక ప్రెస్ మీట్ పెడితే సరిపోయేది.
కరోనా నియంత్రణను అడ్డుకునే విషయంలో అన్ని రాష్ర్టాలలోకి ఒక్కడుగు ముందుకు ఉంటున్న రాష్ర్టం ఆంధ్రప్రదేశ్.
136 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో 17,656 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.అంటే సగటు .001 శాతం.ఐదుకోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పాజిటివ్ కేసులు 722. అది కూడా .001 శాతమే.
ఇదే మీరు గుజరాత్ తీసుకుంటే ఆరుకోట్ల జనాభా ఉంటే పాజిటివ్ కేసులు 1851.అంటే .003 శాతంగా ఉంది.
ఏడుకోట్ల జనాభాతో ఉన్న మధ్యప్రదేశ్ లో 1485 కేసులు సగటు .002 శాతం.మేం ఏ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం లేదు.అక్కడ విపరీతపరిణామాలు ఉండవచ్చు.అందువల్ల అక్కడ కేసులు పెరగవచ్చు.రేపు ఇక్కడా పెరగవచ్చు.కాని ప్రయత్నంలో లోపం లేదు.
శ్రీ వైయస్ జగన్ గారి ప్రభుత్వం ఎటువంటి లోపాలకు తావు ఇవ్వకుండా చాలా స్టేబుల్ గా వ్యాధిని అరికట్టడానికి పనిచేస్తోంది.
ఏ రాష్ర్టంలో కూడా ఇక్కడలా వాలంటీర్ సిస్టమ్ లేదు.ప్రతి 50 ఇళ్లను వాలంటీర్లు కాపలా కాస్తున్నారు.వారి ప్రాణాలను పణంగా పెట్టుకుని
పోలీసు,వైద్యఆరోగ్యసిబ్బందితోపాటు వాలంటీర్లు కూడా పనిచేస్తున్నారు.
ఆ 50 ఇళ్లలో ఏవైనా సమస్యలు ఉంటే తీర్చడం,వారితో నిత్యం మాట్లాడటం,రేషన్ అందించడం,వ్యాధిగ్రస్తులను ఐసోలేషన్,క్వారంటైన్ సెంటర్లకు పంపించడం వంటివి ఇంత పకడ్భందిగా చేస్తుంటే కనీసం ప్రోత్సహించకుండా నిత్యం విమర్శిస్తున్నారు.
ఇలా విమర్శలు చేసేవారిని ఏమి చేయాలనేది ఆంధ్రరాష్ర్ట ప్రజలే ఆలోచించాలి.నిజంగా కన్నాలక్ష్మీనారాయణగారు కాణిపాకం అంటున్నారు.కాణిపాకంలో మీరు ప్రమాణం చేయండి.ఆంధ్రప్రదేశ్ 730 రూపాయలకు రాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను కొనడం తప్పా.....ఇలా అయితే అవే కిట్ లను కేంద్ర ప్రభుత్వం 790 రూపాయలకు కొనడం కూడా తప్పే కదా.
ఈ రెండింటిపై మీరు ప్రమాణం చేయగలుగుతారా...మీ అంతరాత్మను మీరు ప్రశ్నించుకోండి.ఈరోజు సలహాలు,సూచనలు ఇచ్చి జగన్ గారి ప్రభుత్వాన్ని,ఈ రాష్ర్టాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిపోయి మీరు
ఎల్లోమీడియా,చంద్రబాబు ట్రాప్ లో మీరు పడుతున్నారు.
సబ్బం హరిగారు స్టేట్ మెంట్ ఒకటి చదివాను....అదేమంటే మాకు గనుక 70,80సీట్లు ఉంటే దిమ్మతిరిగే పని చేసేవాళ్లం...జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వాన్ని కూల్చేపరిస్దితి తెచ్చేవాళ్లం అని వ్యాఖ్యానించారు.
కరోనాతో అతలాకుతలం అయిన పరిస్ధితులలో ఇవా మీరు మాట్లాడాల్సిన మాటలు....అంటే మీకు 70,80 సీట్లు ఉంటే మళ్లీ పశువులను కొన్నట్లు జగన్ గారి పార్టీనుంచి ఎంఎల్ ఏలను కొని మీరు ప్రభుత్వాన్ని ఫామ్ చేసేవాళ్లా....
ఈ సమయంలో ఇవా మీ ఆలోచనలు.....ఇంత దుర్మార్గమైన ఆలోచనలతోనా మీరు ఉండేది.ఎన్టీఆర్ గారికే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గారి ఆలోచనలు మీకు వ్యాప్తి చెందుతాయికదా...మీరు వేరేగా ఎలా ఆలోచిస్తారు.
విచిత్రం ఏమంటే ....కనీసం కోరుకునేటప్పుడు 70,80 సీట్లు ఏంటి...ఇంత చెత్తఆలోచనలు ఏంటి.మెజారిటీ రావాలి...ప్రజలకు సేవ చేయాలనే మంచి ఆలోచనలు ఉండాలి కాని చెత్తబుధ్దులు,చెత్తఆలోచనలు... వెన్నుపోటు పొడిచేవారికే ఉంటాయని తెలియచేస్తున్నాం.
ఏదిఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేం చెప్పేది ఒక్కటే.అందరం కూడా దేశప్రధాని,మన ముఖ్యమంత్రిగారు చెప్పినట్లు స్వియనిర్భంధంలో ఉందాం.ఇంకా ఎటువంటి ఆంక్షలు వస్తాయో తూచతప్పకుండా పాటిధ్దాం.ఖచ్చితంగా ఈ మహమ్మారిని గెలిచేరోజు వస్తుంది.నెలలు పట్టచ్చు.ఇంకా కష్టకాలం రావచ్చు.ఏది జరిగినా అంతిమంగా విజయం మానవజాతిదే అవుతుంది.
నేను ఇందాక ఓ సీనియర్ అధికారిని అడగాను...ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే...రాష్ర్టంలోకరోనా నియంత్రణలో అంతాపకడ్భందీగా జరుగుతోంది.స్టేబుల్ గా ఉంది.సిఎంగారు నిత్యం రివ్యూలు చేస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.అది వాలంటీర్లద్వారా ప్రజలకు చేరుతోంది.ఇదే సమయంలో చంద్రబాబు లేడు కాబట్టి సరిపోయింది.లేదంటే రివ్యూలు,ప్రెస్ మీట్లంటూ గంటలకొద్ది చావగొట్టేవాడు అని అన్నారు.
అదే జగన్ గారికి,చంద్రబాబుగారికి ఉన్నతేడా.వేమన శతకం ఒకటి గుర్తుకువస్తుంది...అల్పుడెపుడు పలుకు ఆడంబరంగా...సజ్జనుండు పలుకు చల్లగా... కంచుమోగునట్లు కనకంబు మోగునా... విశ్వదాభిరామవినురవేమ.
అలాగే జగన్ గారు తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేతత్వం.చంద్రబాబుగారిది మీకు తెలుసు కదా పనిచేయడు...చేసేవారిని చేయనీయడు.
కరోనా నియంత్రణకు జగన్ గారి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది.