ప్రపంచ మేధావి అని పొగిడి అదే నోటితో నేడు అసభ్య పదజాలంతో దూషణలా :చేజర్ల

*⚡రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుకే ద్రోహం చేసిన వ్యక్తి ప్రసన్న*
*⚡ప్రసన్న వెన్నుపోటు చరిత్ర తెలుసుకనుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇతని కంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చి ఇతనికి ఇవ్వలేదు*
 *⚡నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి  చేత కరోనా పై లైవ్ ప్రెస్సుమీట్ పెట్టించు
*⚡అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
                            - *చేజర్ల*
    *తనకు రాజకీయ బిక్షపెట్టిన చంద్రబాబు నాయుడు కే ద్రోహం చేసిన చరిత్ర కలిగిన వ్యకి ప్రసన్నకుమార్ రెడ్డి ని ఆయన చరిత్ర తెలుసుకనుకనే శ్రీ జగన్మోహన్ రెడ్డి  జిల్లాలో ఇతనికంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చి ఇతనిని పక్కన పెట్టారని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.ఈరోజు కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరినుంది ఎలా బయటపడాలని అందరూ ఆలోచిస్తుంటే కోవూరు శాసనసభ్యుడు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని,ఇదే ప్రసన్నకుమార్ రెడ్డి గతములో  చంద్రబాబు నాయుడి గారిని ప్రపంచ మేధావి అని పొగిడారని అదే నోటితో నేడు అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తున్నారని,గతములో స్వర్గీయ వై యెస్ రాజశేఖరరెడ్డి  గారిని,జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారని,తన వ్యక్తిగత స్వార్థం కోసం ఎంత కయినా దిగజారే వ్యకి అని,2009 లో తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచి నెల తిరగకుండానే పార్టీ మారిన వ్యక్తి ప్రసన్న అని ఇటువంటి వారు కూడా చంద్రబాబు ను తిట్టడము విడ్డురాంగా ఉందని,లాక్ డౌన్ నిబంధనలు కు కట్టుబడి హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు గారి పై విమర్శలు చేస్తున్నారని,గతములో వై యెస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు గా ఉన్న 5 సంవత్సరాలు హైదరాబాద్ లోనే ఉన్నారని,నాడు రాష్ట్రంలో పెద్ద పెద్ద తుపానులు వచ్చిన రాష్ట్రంలో తొంగికుడా చడలేదని అటువంటి వారి నేడు చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారని విమర్శలు చేస్తున్నారని,మీ ముఖ్యమంత్రి కి కరోనాను అరికట్టడము చేతకాదని చెప్పండి చంద్రబాబు గారు వచ్చి చేసి చూపిస్తారని,శ్రీ ప్రసన్నకుమార్ రెడ్డి గారికి దమ్ముంటే మీ ముఖ్యమంత్రి చేత కరోనా వైరస్ గురించి ఒక లైవ్ ప్రెస్సుమీట్ పెట్టించి తరువాత చంద్రబాబు గురించి మాట్లాడాలని అదేవిధంగా తన నోటిని అదుపులో పెట్టుకోవాలని లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని అన్నారు.*


*అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి*
#################


*నిన్న కురిసిన అకాల వర్షాల వలన జిల్లాలో రైతులు త్రీవరం గా నష్టపోయారని ముఖ్యంగా పండ్ల తోటల రైతులు ఎక్కువుగా నష్టపోయారని కావున నిన్న కురిచిన అకాల వర్షాలు వలన నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము*


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు