స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకి దిశానిర్దేశం చేసిన ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్

స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకి దిశానిర్దేశం చేసిన ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్   గౌతమ్ సవాంగ్ IPS.


అమరావతి మే 15 (అంతిమ తీర్పు) : .రాష్ట్రంలో ఇసుక మరియు మద్యం అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపే దిశగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.
స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పేరుతో అక్రమ ఇసుక రవాణా మరియు అక్రమ మద్యాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ఇప్పటికే  ఉత్తర్వులను జారీ చేసింది. 
 మద్యం పాలసీని పటిష్టంగా అమలు చేసే దిశగా ఈ కొత్త  డిపార్ట్మెంట్ కి  IPS అధికారి నేతృత్వంలో జవసత్వాలు నింపి ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా  కొత్త శాఖను  కార్యోన్ముఖం చేసే దిశగా వడి వడి గా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో డీజీపీ  గౌతమ్ సవాగ్ గారు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్  శ్రీ వినీత్ బ్రిజ్ లాల్   ఆధ్వర్యంలో  మొట్ట మొదట వీడియో కాన్ఫరెన్స్ మంగళగిరి డీజీపీ ఆఫీస్ లో జరిగింది. ఇందులో , లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ శ్రీ రవి శంకర్ అయ్యన్నారు , ఇతర సీనియర్ IPS అధికారులు, జిల్లా ఎస్పీలు,  SEB అడిషనల్ ఎస్పీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి‌జి‌పి గౌతమ్ సవాంగ్  గారు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో విధి విధానాలను జిల్లాల ఎస్పీ లకు వివరించారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏర్పాటు ముఖ్య ఉద్దేశం, పనితీరు,        ఎస్‌పి లతో  చర్చించారు.
అక్రమ ఇసుక తవ్వకాలు నివారణ,  అక్రమ మద్యం తయారీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, ఆకస్మిక దాడులను నిర్వహించడం, ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయడం, నిందితులను న్యాయస్థానంలోకి ప్రవేశపెట్టడం, కేసు దర్యాప్తు, ఛార్జిషీట్లను రూపొందించడం, నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లను execute చేయడం, పీడీ యాక్టులను ప్రయోగించడం ప్రాధాన్యతా అంశాలు గా ముందుకు వెళ్లాలని డీజీపీ గారు దిశా నిర్దేశం చేశారు. ఫలితాలను సాదించేందుకు విప్లవాత్మక చర్యలను తీసుకోవాలని సూచించారు.


 *70:30 నిష్పత్తిలో ఉద్యోగులు* 
.. 
ప్రస్తుతం ఉన్న excise department లో ఉన్న ఉద్యోగులను 70 శాతం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కి, మిగతా 30 శాతం ఎక్సైజ్  కు  ఉద్యోగులను బదలాయింంచిన విషయాన్ని తెలియ చేస్తూ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కి బదలాయించిన ఉద్యోగులను మరియు పోలీసు శాఖ సిబ్బంది మధ్య సమన్వయం చేసుకుంటూ మంచి ఫలితాలను సాధించాలని డీజీపీ గారు ఆకాంక్షించారు. ఖాళీలను భర్తీ చేయడానికి కాలానుగుణంగా నోటిఫికేషన్లను జారీ చేసే విధంగా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు.


 *వే బ్రిడ్జి లు, సీసీటీవీ పని తీరు పై స్పెషల్ డ్రైవ్:* 


ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ ఆదేశాలతో, అన్ని జిల్లాల ఎస్పీలు ఆధ్వర్యంలో, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా వున్న 475 సాండ్ రీచులు, స్టాక్ యార్డుల ను తనిఖీ చేశారు. అక్కడ ఉన్న వే బ్రిడ్జిలు, సీసీ కెమెరా ల పని తీరు, చెక్ పోస్ట్ ల నిర్వహణ పై ఆరా తీశారు. ఈ సందర్భంగా కేవలం కొన్ని ప్రదేశాలలో వే  బ్రిడ్జిలు పని చేస్తున్న విషయాన్ని  గుర్తించి, సంబందిత అధికారులను దీనికి సంబంధించి రిపోర్ట్ పంపవలసినదిగా ఆదేశాలు యిచ్చారు. అదే విదంగా కేవలం 128 ప్రదేశాల్లో సీసీ కెమెరాలు పని చేస్తున్న విషయాన్ని గుర్తించి, మిగతా ప్రదేశాల్లో వెంటనే  సీసీ  కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.