పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ...
.. వింజమూరు పంచాయతీ పరిధిలోని నార్త్ ఎస్సీ కాలనీలో సోమవారం గ్రామంలోని కుటుంబాలకు స్థానిక నివాసి నీసు చెన్నకేశవులు మహాలక్ష్మి దంపతులు నిత్యావసర సరుకులను తాసిల్దార్ ఎం. వి. కె. సుధాకర్ రావు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి రాజారావు చేతుల మీదగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సుధాకర్ రావు ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో గడిచిన ఒకటిన్నర నెల నుండి పనులు లేక పేదలు కుటుంబం గడవడం కష్టతరంగా మారింది. ఇలాంటి తరుణంలో గ్రామానికి చెందిన చెన్నకేశవులు దంపతులు ముందుకు వచ్చి వారు ఉంటున్న ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ముందుగా వారిని అభినందించాలి అన్నారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జూపల్లి రాజారావు మాట్లాడుతూ కేశవులు సభ్యులు కష్టే ఫలి అన్న సిద్ధాంతాన్ని నమ్మి బంగ్లా సెంటర్ లో చిన్న హోటల్ నిర్వహిస్తూ వారి పిల్లలను తాము పడ్డ కష్టం పడకూడదనే ఉద్దేశంతో బాగా చదివించారు అన్నారు. వారిలో ఒక అబ్బాయి బ్యాంకు ఉద్యోగం సంపాదించగా మరో అబ్బాయి గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. వారు ఇప్పుడు చేస్తున్న సహాయము మరువలేనిదన్నారు. ప్రతి ఒక్కరూ ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటికే పరిమితం కావాలన్నారు. అధికారులు సూచనలు సలహాలు పాటిస్తూ జీవనం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు నీసు బాలకృష్ణ. దళిత సంఘం నాయకులు వా గాల పెంచలయ్య
తదితరులు పాల్గొన్నారు.