కరోనా చెక్ పోస్టులు పరిశీలించిన కావలి డి.యస్.పి

*కరోనా చెక్ పోస్టులు పరిశీలించిన కావలి డి.యస్.పి


వింజమూరు, మే 8 (రిపోర్టర్-దయాకర్ రెడ్డి): వింజమూరులో కరోనా వైరస్ నియంత్రణా చర్యలలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్టులను శుక్రవారం నాడు కావలి డి.యస్.పి ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వింజమూరు మండలం గ్రీన్ జోన్ లో ఉందని, ఇప్పటివరకు ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్నారు. ప్రజలందరూ కూడా గత 50 రోజులుగా స్వీయ నిర్భంధం పాటించడం అభినందనీయమన్నారు. రెడ్ జోన్ ప్రాంతాల నుండి తరలివస్తున్న వారిని గుర్తించేందుకు వీలుగా వింజమూరు మండలంలోని పలు ప్రాంతాలలో 6  ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీ బృందాలను నియమించడం జరిగిందన్నారు. అనంతరం చెక్ పోస్టు వద్ద నున్న సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా డి.యస్.పి వెంట స్థానిక ఎస్.ఐ బాజిరెడ్డి, వారి సిబ్బంది ఉన్నారు.