ప్రజల ఖాతాల్లోకి రూ. 10 వేలు వేసి వారిని ఆదుకోవాలి : కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్

లాక్‌డౌన్ కాలంలో కరెంట్ బిల్లులను రద్దు చేయాలి
* కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్
* ప్రజలను పిండుతున్న ప్రభుత్వాలు 
* విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ చార్జీలు చెల్లించాలి
విజయవాడ: గృహ విద్యుత్ బిల్లుల్లో రెట్టింపు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, మార్చి నెలలో బిల్లు రీడింగ్ తీయకపోవడం, ఏప్రిల్ బిల్లుతో కలిపి హెచ్చు రీడింగ్ తీసి స్లాట్లు మార్చి వినియోగదారులకు వేలల్లో బిల్లుల వడ్డింపులు చేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం లాక్‌డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని, లాక్డౌన్ వలన దెబ్బతిన్న ప్రజలు ఈ భారం మోసే పరిస్థితిలో లేరు కనుక విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ చార్జీలు చెల్లించాలని పేర్కొన్నారు. మరోపక్క వలస కార్మికుల వద్ద రైలు చార్జీలు వసూలు చేస్తున్నారని  ఆరోపించారు . గత 50 రోజులుగా లాక్ డౌన్ లో ఉన్న ప్రజలు అనేక కష్టనష్టాలు ఎదుర్కొని ప్రభుత్వాలకు సహకరించారని , కానీ ఆదుకోవలసిన ప్రభుత్వాలు పెట్రోల్ , కరెంట్ తదితర ప్రజావసరాల చార్జీలు పెంచి వారి నుంచి డబ్బులు పిండుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం మార్చి నెలలో పెట్రోల్, డీజిల్‌పై రూ.3 ఎక్సైజ్ సుంకం పెంచి, మరల మే నెలలో పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13లు పెంచి ఖజానాను నింపుకుంద‌న్నారు. అంతర్జాతీయ ఆయిల్ ధరలు కనీస స్థాయికి పడిపోయినా పెట్రోల్ ధరలు తగ్గించలేదన్నారు. దీనికి తోడు రాష్ట్రాలు వ్యాట్ పెంచుతూ కేంద్రంతో పాటు వినియోగదారులపై భారాన్ని మోపుతూనే ఉన్నాయన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కూలీలు, చిన్న వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవడంతో సరైన ఆదాయానికి నోచుకోలేదన్నారు. వీరిపై పన్నుల మీద పన్నులు వేస్తూ ప్రభుత్వాలు మరింత కష్టాల్లోకి నెట్టుతున్నాయన్నారు . ఉద్దీపన చర్యలు తీసుకోకపోగా ధరలు పెంచడం శోచనీయమన్నారు. రాష్ట్రం ప్రతి కుటుంబానికి రూ.1000, కేంద్రం రూ.500 మినహా బీద, బలహీన కుటుంబాలకు గత రెండు నెలలుగా ఇచ్చిందేమీ లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల ఖాతాల్లోకి రూ. 10 వేలు వేసి వారిని ఆదుకోవాలన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు