చర్మకారుల అభివృధ్ధి కోసం ప్రత్యేక ప్యాకేజి కి 12 గంటల నిరాహారదీక్ష- రావెల

అమరావతి
 చర్మకారుల అభివృధ్ధి కోసం ప్రత్యేక ప్యాకేజి కి 12 గంటల నిరాహారదీక్ష- రావెల


ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా చర్మకారి వృత్తిలో పని చేస్తున్న సుమారు 25 వేలమంది కార్మికులు గత 45 రోజులుగా వృత్తి నిర్వహణ లేక రోజువారీ వృత్తి పై ఆధారపడి జీవిస్తున్న ప్రతి చర్మకారుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో అనేక కార్పొరేట్ సంస్థలు పోటీపడి మాదిగల కులవృత్తి పై పడిందని ప్రపంచంలో అతి పెద్దవైన బాటా, షోలపూర్,కరోనా,రిలయన్స్ ,మొచి అనే సంస్థలు ఆధిపత్యం మద్య అసలైన చర్మకారుల నష్టపోతూ ప్రాణాలను సైతం పోగొట్టుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో సంయుక్త ఆంద్రప్రదేశ్ రాష్ట్రంగా వున్నప్పుడు రాజశేఖరరెడ్డి    ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్మకారుల కోసం ఒక ప్రత్యేక సంస్థ "లిడ్ క్యాబ్"సంస్థ చెప్పులు షాప్ లు ఏర్పాటుకు సుమారు 50 వేలనుంది ఒక లక్ష రూపాయలు వరకు పూచీకత్తు లేని రుణాలు మంజూరు చేసేవని కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణా వేరుపడ్డాక ఆసంస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచ మానవాళి ఉనికికే ప్రమాదం గా మారిన ఈ కరోనా వైరస్ కారణం గా లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న చర్మకారులకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి వారిని ఆదుకోవాలని  ప్రధాన డిమాండ్ తో చర్మకారి వృత్తుల వారికి మద్దతుగా ప్రపంచ కార్మిక దినోత్సవం " మేడే " సందర్భంగా  ఈరోజు ఈ దీక్ష చేపట్టానని మాజీ మంత్రివర్యులు బిజెపి నాయకులు రావెల కిషోర్ బాబు   ప్రభుత్వాన్ని  తక్షణం చర్మకారుల ఆకలి బాధలు తీర్చి సహాయం చేయాలని.దీనిపై ప్రభుత్వం సత్వరమే స్పందించి చర్మకారుల ఆర్థిక స్వాలంబాణకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి వారిని ఆదుకోవాలని కిషోర్ బాబు తెలిపారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు