03–05–2020
అమరావతి
కోవిడ్–19 నివారణా చర్యలపై సీఎం వైయస్.జగన్ సమీక్ష – సమావేశంలో కీలక నిర్ణయాలు
1)
ఎక్కడి వారు అక్కడే
పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి
సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దు
కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలకే అనుమతి
ప్రస్తుతం ఇలా వస్తున్న వలసకూలీలు వేలల్లో ఉంటున్నారు
వారందర్నీ క్వారంటైన్ కేంద్రాల్లో పెడుతున్నాం, పరీక్షలు చేస్తున్నాం
వీరికి సదుపాయాల కల్పన చాలా కష్టమవుతోంది
అందువల్ల మిగిలిన వారు సహకరించాలి
కోవిడ్–19 విపత్తు దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండడం క్షేమకరం
ప్రయాణాల వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ
అంతేకాదు మీ ఇళ్లల్లో ఉన్న పెద్దవారి ఆరోగ్యాలకు ముప్పు ఉంటుంది
ప్రజారోగ్యం కోసం ఏపీలో పెద్ద ఎత్తున కోవిడ్ –19 నివారణా చర్యలు
ప్రభుత్వం చర్యలకు ప్రజలనుంచి సహకారం కొనసాగాలి
కోవిడ్–19పై పోరాటంలో మీరు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయం
ప్రభుత్వం ఇస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలి
2)
ఏపీలో మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం మరిన్ని అడుగులు
మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేలా కీలక నిర్ణయాలు
25శాతం పెరగనున్న మధ్యం ధరలు
రానున్నరోజుల్లో మరిన్ని దుకాణాల సంఖ్య తగ్గింపునకూ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తెరుచుకోనున్న మద్యం దుకాణాలు
పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు
మద్యపానాన్ని నియంత్రించడం, రద్దీని తగ్గించే దిశగా ప్రభుత్వం అడుగులు
భౌతిక దూరం పాటించేలా మద్యం విక్రయాలు