కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం సమీక్ష

02–05–2020
అమరావతి


*కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం సమీక్ష



అమరావతి: 
కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ.    వైయస్‌.జగన్‌ సమీక్ష
డిప్యూటీ సీఎం ఆళ్లనాని, వ్యవసాయశాఖమంత్రి కన్నబాబు, అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ నాగిరెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి సహా ఇతర అధికారులు హాజరు.
వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో కోవిడ్‌–19 పరిస్థితుల కారణంగా చిక్కుకుపోయిన వారు తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చ
ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశం
ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్‌ వసతి కల్పించాలి
వారిక్కావాల్సిన భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం
కనీసం ఒక లక్ష బెడ్లు సిద్ధంచేసుకోవాలని సీఎం ఆదేశం
అంగన్‌వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్‌ ఈ మూడూ కలిసి గ్రామాల్లో కోవిడ్‌ –19 క్వారంటైన్‌ చర్యలు చేపట్టాలని ఆదేశం


కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్‌ వాహనాలుగా మార్చాలని సీఎం ఆదేశం
ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటుచేసి పాలు,పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేయాలన్న సీఎం
కేసుల తీవ్రత ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేసి నిత్యావసరాలకోసం ఒక వ్యక్తికే పాసు ఇవ్వాలన్న సీఎం
డాక్టరు, ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్త,  మందులు కూడా మొబైల్‌ యూనిట్‌కు అందుబాటులో ఉంచాలన్న సీఎం


లాక్‌డౌన్‌ పొడిగింపు, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలపై సమీక్ష
కేంద్రహోంశాఖ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కడెక్కడ కంటైన్‌మెంట్‌ జోన్లు ఉండాలి అన్నదాన్ని గుర్తించి, అక్కడ అనుసరించాల్సిన విధానాలపై విధివిధానాలు తయారుచేయాలని అధికారులకు సీఎం ఆదేశం
అనుమతులు ఉన్న దుకాణాలవద్ద పాటించాల్సిన ఎస్‌ఓపీలను ఇవ్వాలని సీఎం ఆదేశం


రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌–19 పరీక్షలు 1,08,403
నిన్న 5,943 పరీక్షలు
ప్రతి పదిలక్షలకు 2030 మందికి పరీక్షలు
పాజిటివిటీ కేసుల రేటు 1.41శాతం.. దేశవ్యాప్తంగా 3.82శాతం
రాష్ట్రంలో మరణాల శాతం 2.16శాతం, దేశవ్యాప్తంగా 3.28శాతం


క్వారంటైన్లలో సదుపాయాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారా? లేదా? అని సీఎం ఆరా
సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదానిపై తనకు తెలియజేయాలని సీఎం ఆదేశం.


మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామన్న అధికారులు
ఈలోగా మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను బలోపేతం చేయాలన్న సీఎం
ఈలోగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డుల ఏర్పాటుపై విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం ఆదేశం
వీటిని ఆర్బేకేలకు అనుసంధానం చేయాలన్న సీఎం
మే‌ 6న మత్స్యకార భరోసాకు సిద్ధం అయ్యామన్న అధికారులు
రైతు భరోసాకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతున్నామని, ఎవరైనా పేరులేకపోతే దరఖాస్తు చేసుకునేలా ప్రచారం చేస్తున్నామని వెల్లడించిన అధికారులు.


ప్రతి పంటలోనూ ప్రభుత్వం తరఫున ఎంత కొనుగోలుచేయాల్సి ఉంటుంది, ఆమేరకు రోజువారీగా సేకరణ ఎంతచేయాలి? చేస్తున్నారా? లేదా? అన్నదానిపై వివరాలు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం
ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద ధాన్యం తేమకొలిచే సాధనాలను అందుబాటులో ఉంచాలని, వీటిని ప్రతి రైతు భరోసా కేంద్రంవద్ద ఉంచాలని సీఎం ఆదేశం


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు