కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే రాష్ట్రంలో మద్యం విక్రయాలకు అనుమతులు : అబ్కారీ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి


                                                                                                తేది : 06.05.2020
                                                                                                            అమరావతి.


*కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే రాష్ట్రంలో మద్యం విక్రయాలకు అనుమతులు*


• *ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యం.*
• *దశలవారిగా మద్యనిషేదం అమలుకు కట్టుబడి ఉన్నాం.*
• *మద్యపాన నిషేధానికి సీఎం జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు* 
• *మద్యం ధరలు పెంచడం ద్వారా మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట.*
• *ప్రతిపక్షాల ఆరోపణలు అర్ధరహితం*   : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి


అమరావతి 6,మే : కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే రాష్ట్రంలో మద్యం విక్రయాలకు ఆంధ్రప్రదేశ్ లో అనుమతులిచ్చినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి తెలిపారు. సచివాలయం నాల్గవ బ్లాక్ లోని తన కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరిచినట్లే మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు మద్యం షాపులు తెరిచేందుకు అనుమతులు ఇచ్చామన్నారు. ఈ అంశంపై కొందరు చేస్తున్న విమర్శలు అర్థరహితం అన్నారు.  రాష్ట్రంలో మద్యం షాపులు తెరిచే అంశంలో కొందరు మహిళల నుండి వ్యక్తమవుతున్న ఆందోళనలు ఎంతమాత్రం నిజంకాదన్నారు. వారంతా కొందరు పనిగట్టుకొని రెచ్చగొడుతున్న వ్యక్తులే అని ఆరోపించారు.  


తమ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి దశల వారీగా రాష్ట్రంలో మద్య నిషేదం అమలు చేసి తీరుతామని నారాయణస్వామి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కరోనా నియంత్రణలో భాగంగా మద్యం జోలికి వెళ్ళాలంటే షాక్ తగిలే ధరలను 75 శాతం పెంచడం జరిగిందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా 70 శాతం మేర మద్యం ధరలను అక్కడి ప్రభుత్వాలు పెంచాయని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే ఇచ్చిన మాట మేరకు గత ప్రభుత్వ హయాంలోని 43 వేల బెల్ట్  షాపులను తొలగించారన్నారు. అదే విధంగా ప్రతీ ఏటా 20శాతం మద్యం షాపులను తొలగిస్తూ వస్తున్నామని వెల్లడించారు. వాటితో పాటు ప్రతీ ఏటా 25శాతం మద్యం ధరలు పెంచుకుంటూ పోతున్నామని తెలిపారు. 


రాష్ట్రంలో ఎక్కడా బార్ షాపులను తెరవలేదని మంత్రి స్పష్టం చేశారు. మద్యం ధరలను పెంచుకుంటూ పోవడం ద్వారా పేదలు వాటి జోలికి పోకుండా ఉంటారన్న నమ్మకం ప్రభుత్వానికి ఉందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిరంతరం అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నట్లు మంత్రి  తెలిపారు. నవరత్నాల్లో భాగంగా ఇప్పటికే అమ్మఒడి, రైతుభరోసా, విద్యావసతి దీవెన, సున్నా వడ్డీకే మహిళలకు రుణాల పథకం, ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. అదే విధంగా చేనేతలకు, మత్స్యకారులకు, మహిళలకు ఆర్థికసాయం అందించే పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న పలు బకాయిలు తీర్చామన్నారు. కరోనా లాంటి క్లిష్ట విపత్తు సమయంలో ప్రజలకు అదనపు రేషన్ అందించామన్నారు. ఈ సందర్భంగా గతంలో కీర్తిశేషులు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మద్య నిషేదం అమలు చేసిన వైనాన్ని డిప్యూటి సిఎం నారాయణ స్వామి గుర్తుచేశారు. ఆ తరువాత అధికారం చేపట్టిన ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించిందని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున మహిళలు కలిసి తమకు ఏం చేయకపోయినా మద్యపాన నిషేధం చేస్తే చాలని విన్నవించడంతో దశల వారీగా మద్యనిషేదం అమలు చేస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకొంటున్న ప్రజానాయకుడు జగన్ అన్నారు. మహిళలకు ఇచ్చిన మాట జగన్ తప్పరని నారాయణస్వామి తెలిపారు. మద్యపాన నిషేధానికి సీఎం జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మంత్రి వివరించారు. జే ట్యాక్స్ తీసుకోవాల్సిన అవసరం తమ ముఖ్యమంత్రి జగన్ కు లేదన్నారు. షాపుల ముందు ఎక్కువ మంది ఉంటే షాపులు మూసేయడానికి వెనకాడబోమన్నారు. పేదవాళ్లు బాగుపడాలన్నదే జగన్ లక్ష్యమన్నారు. సంపాదించిన సొమ్మంతా తాగడానికి కాకుండా కుటుంబానికి ఖర్చుపెట్టే ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగా మద్యం రేట్లు పెంచారన్నారు. వినియోగదారుల సంఖ్య తగ్గించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆరోగ్యకరమైన జీవితం అందించాలన్నదే ముఖ్యమంత్రి  దృక్పథమన్నారు. మద్యం మీద వచ్చే ఆదాయంతో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేదన్నారు. ఐడీ, ఎన్డీపీ, గంజాయి, గుట్కాల నిషేధం బాధ్యత ఎస్పీల భుజాన వేశామన్నారు. మద్యం అక్రమాల్లో ప్రమేయం ఉన్న వారిని సస్పెండ్ చేశామన్నారు. 


ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు మద్యపాన నిషేధానికి తమ వంతుగా నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుందన్నారు. అంతేతప్ప రాజకీయాలు చేయడం సరికాదన్నారు. పార్టీలకతీతంగా అన్ని కులాలు, మతాలు, వర్గాల వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. దేవుడు దీవించాడు.. ప్రజలు ఆశీర్వదించారు కాబట్టే తనకు సేవ చేసే అవకాశం దొరికిందని ముఖ్యమంత్రి నమ్ముతారన్నారు. ప్రతి పేదవాడు ఎదగాలన్నదే ముఖ్యమంత్రి లక్య్శమన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి పక్షానే ఉన్నారన్న విషయం గ్రహించాలన్నారు.


 


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
విజయవాడ ఏపీ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కామెంట్స్.. ఓవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్ కు కనిపించడం లేదా ముఖ్యమంత్రి జగన్ వారానికి ఒకటి...రెండు రోజులు స్కూల్ పెట్టడం ఏంటి ముఖ్యమంత్రి జగన్ బాద్యతారాహిత్యానికి ఇది నిదర్శనం పసిపిల్లల ప్రాణాలతో జగన్ ఆటలాడుకుంటున్నారు పిల్లలకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలి
Image
*వింజమూరు చెన్నకేశవస్వామికి ఆభరణం బహూకరణ* వింజమూరు, జూన్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని యర్రబల్లిపాళెంలో పురాతన చరిత్రను సంతరించుకున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారికి నడిమూరుకు చెందిన భక్తులు గురువారం నాడు బంగారు తాపడంతో చేసిన వెండి కిరీటమును, స్వామి అమ్మవార్లుకు పట్టు వస్త్రాలను బహూకరించారు. నడిమూరులో కీ.శే. యల్లాల.చినవెంకటరెడ్డి-ఆయన ధర్మపత్ని పుల్లమ్మల జ్ఞాపకార్ధం వారి కుమారులు యల్లాల.శ్రీనివాసులురెడ్డి, యల్లాల.రఘురామిరెడ్డి, యల్లాల.వెంకటరామిరెడ్డిలు కుటుంబ సమేతంగా దేవస్థానంకు చేరుకుని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు గణపం.వెంకటరమణారెడ్డి, గణపం.సుదర్శన్ రెడ్డి ల సమక్షంలో దేవదేవేరునికి అలంకరణ నిమిత్తం పూజారులకు అందజేశారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్ధం ప్రజలందరూ పాడిపంటలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని అర్చకులు రంగనాధస్వామి, వెంగయ్య పంతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అనిల్, భరత్, పునీత్, ఆశ్రిత్, ఫన్నీ, విరాజిత, రిత్విక తదితరులు పాల్గొన్నారు.
Image