అధికారంలో వున్నా లేకపోయినా కష్టాల్లో వున్న పేద ప్రజలకి అండగా ఉంటాం. :. ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్
ఉయ్యురు :. నగర పంచాయతీ 13 వ వార్డులో సుందరంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు *రాజేంద్ర ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్* ల సహకారంతో అనారోగ్యంతో వున్న పైలా నందిని అనే పేద విద్యార్థినికి వైద్య ఖర్చుల నిమిత్తం 20000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్సీ *రాజేంద్ర ప్రసాద్*
ఈ సందర్భంగా *రాజేంద్ర ప్రసాద్* గారు మాట్లాడుతూ ఇటీవలే నేను సుందరంపేటలోని 13, 14 వార్డుల్లో పర్యటనకు వచ్చినప్పుడు నందిని అనే అమ్మాయి అనారోగ్యంగా ఉందని సుందరంపేట తెలుగుదేశం నాయకులు నా దృష్టికి తీసుకురావటంతో నేను వెంటనే క్యాపిటల్ హాస్పిటల్ వారితో మాట్లాడి వైద్యం చేయించానని, దానిలో భాగంగానే ఈ రోజు 20000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశామని, అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే CMRF ద్వారా ఇంకా పెద్ద మొత్తంలో ఆదుకొనేవాళ్లమని,గతంలో ఉయ్యురు చుట్టు ప్రక్కల ప్రజలకు సుమారు 15 కోట్ల రూపాయలు నేను చంద్రబాబు గారితో చెప్పి CMRF ద్వారా ఇచ్చామని, ఇప్పటి ప్రభుత్వం పేదలను పట్టించుకునే పరిస్థితుల్లో లేదని *రాజేంద్ర ప్రసాద్* గారు అన్నారు.
అలాగే అక్కడ వున్న స్థానిక మహిళలు ఒక్క సారి చూద్దాం అని జగన్ కి ఓటు వేసి తప్పు చేశామని, మొన్నటి వరకు ఇసుక దొరక్క పనులు లేక ఇబ్బందులు పడితే, ఇప్పుడు కరోనా వచ్చి ఇల్లు గడవక మాకుటుంబాల పరిస్థితి దారుణంగా వున్నా ఎవ్వరు పట్టించుకోవటంలేదని *రాజేంద్ర ప్రసాద్* గారితో అన్నారు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూనపరెడ్డి వాసు,పొగిరి రాము, నడిమింటి పైడయ్య, జగరోతు లక్ష్మణ, మీసాల అప్పలనాయుడు, తౌడు, బూరెల నరేష్, బోనంగి సత్యం, డా.రాంబాబు, యడ్ల శ్రీను, లంకా రాము, అలిబిల్లి శ్రీను, పల్లి వెంకటేశ్వర్లు మరియు రాజేంద్ర యువత సభ్యులు చెదుర్తిపాటి ప్రవీణ్, జంపన వీర శ్రీనివాస్, ఈడే అంజిబాబు, శ్యామల రావు మరియు 13,14 వ వార్డ్ సుందరంపేట యువత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.