చరిత్రలో ఈ రోజు  -మే, 2

చరిత్రలో ఈ రోజు  -మే, 2


సంఘటనలు
1837 - మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే  (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి.) ఇండియన్ పీనల్ కోడ్ మీద రిపోర్ట్ ఇచ్చాడు.
1945 - రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోతున్న సమయంలో, రష్యన్ సైన్యం, బెర్లిన్ని జయించింది.
1952 - ప్రపంచంలోని మొట్టమొదటి జెట్ లైనర్ లండన్ నుంచి జోహన్నెస్ బర్గ్ కి తన మొట్టమొదటి ప్రయాణం చేసి, 'జెట్ యుగాని' కి తెరతీసింది.
1982 - ఫాక్ లేండ్ యుద్దం (అర్జెంటీనా - ఇంగ్లాండుల మధ్య ఫాక్ లేండ్ దీవుల కోసం జరిగిన యుద్ధం) లో బ్రిటన్కి చెందిన రాయల్ నేవీ సబ్ మెరీన్, అర్జెంటీనాకు చెందిన యుద్ధనౌకను (పేరు: ది జనరల్ బెల్ గ్రానో) ముంచేసింది. అందులో 1000 మంది ఉన్నారని అనుకున్నారు.
1986 - రష్యాలోని చెర్నోబిల్ అణు రియాక్టరు నుంచి ప్రమాదవశాత్తు బయటపడిన అణుధార్మికత (రేడియేషన్) ఫ్రాన్స్, బ్రిటన్ లకు పాకింది.
1995: రాజేంద్ర కుమారి పాండిచ్చేరి గవర్నరుగా నియామకం.
2007 - ఆంధ్ర ప్రదేశ్ విధాన మండలి 22 సంవత్సరాలు తరువాత పునరుద్దించ బడిన రోజు


జననాలు
1729: కేథరిన్ ది గ్రేట్
1904: బింగ్ క్రాస్ బీ, అమెరికన్ గాయకుడు, నటుడు.
1911: పి.పుల్లయ్య, తెలుగు చిత్ర నిర్మాత, దర్శకుడు. (మ.1985)
1919: పాగ పుల్లారెడ్డి, గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాటుపడ్డాడు. (మ.2010)
1921: సత్యజిత్ రే, భారత దేశ సినిమా దర్శకుడు. (మ.1992)
1929: పెనుమర్తి విశ్వనాథశాస్త్రి, ఆంధ్రప్రభ దినపత్రిక విజయవాడలో ఛీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేశారు, "స్వప్న లిపి" పేరుతో వెలువరించిన వీరి కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది
1943: దేవిక, అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది.
1947: కోడెల శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సినియర్ నేత, తొలి శాసనసభాపతి.
1964: నారాయణం నరసింహ మూర్తి, అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఓ ప్రముఖ పర్యవరణ వేత్త. ఆయన పర్యావరణ కవితోద్యమం అనే ఉద్యమాన్ని తెలుగు నాట 2008 లో ప్రారంభించారు.
1969: బ్రియాన్ లారా, వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు.
1980: ట్రాయ్ మర్ఫీ, అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు.


మరణాలు 
1519: లియొనార్డో డావిన్సి, గణిత శాస్త్రజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీత కళాకారుడు. (జ.1452)
1975: పద్మజా నాయుడు, సరోజిని నాయుడు  కుమార్తె. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నరు. (జ.1900)
2011: బిన్ లాడెన్ను అమెరికన్ సి.ఐ.ఏ. కాల్చి చంపింది.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు