టెలీ మెడిసిన్ కింద డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన 24 గంటల్లో మందులు అందించాలి: సిఎస్.*


తేదీ:02.05.2020


*ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో 10పడకలతో కమ్యునిటీ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి*


*మండల, గ్రామ స్థాయి కమిటీలు ఆయా మండలాలు, గ్రామాలను పరిరక్షించుకోవాలి.*


*ఆరోగ్య సేతు యాప్ ను తప్పనిసరిగా వినియోగించేలా చూడండి.*


*టెలీ మెడిసిన్ కింద డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన 24 గంటల్లో మందులు అందించాలి: సిఎస్.*


అమరావతి,2మే: రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో 10 పడకలతో కూడిన కమ్యునిటీ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి అంగన్ వాడీ లేదా మధ్యాహ్న భోజన పధకం ఆయాలు ద్వారా అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆమె జిల్లా కలెక్టర్లలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఫీవర్ సర్వేలో గుర్తించిన వారిలో ఇంకా ఆర్ టిపిసిఆర్, ఆర్ టికెల ద్వారా నిర్వహించాల్సిన శాంపిల్ టెస్ట్ లను ఆదివారం సాయంత్రం లోగా పూర్తి చేయాలని  కలెక్టర్లను ఆదేశించారు.


 ఆరోగ్య సేతును తప్పనిసరిగా  ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలన్నారు. టెలిమెడిషన్ విధానంలో డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన 24 గంటల్లోగా మందులు పంపిణీ అయ్యేలా చూడాలని సిఎస్ నీలం సాహ్ని చెప్పారు.దేశంలో  ఏరాష్ట్రంలో చేయని విధంగా రాష్ట్రంలో లక్షకుపైగా టెస్టులు నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈటెస్టులకు సంబంధించి టెస్టుల వారీ విశ్లేషణ చేయాలని చెప్పారు.
వెటర్నరీ మైక్రో బయాలజిస్టులను కరోనా వైరస్ వైద్య సేవలు అందించేందుకు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కంటైన్మెంట్ ప్రాంతాలకు వెలుపల పరిశ్రమలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.


వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వెటర్నరీ మైక్రో బయాలజిస్టులను కరోనా వైద్య సేవలకు వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.


ఈవీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, సిఆర్డిఏ అదనపు కమీషనర్ విజయ కృష్ణన్ పాల్గొన్నారు.


 


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు